Mynampally Hanumanth Rao : అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను : మైనంపల్లి

బీఆర్ఎస్ లో సర్వేల ప్రకారం టికెట్ ల కేటాయింపు జరుగలేదని విమర్శించారు. తనను టార్గెట్ చేస్తేనే... వారిని టార్గెట్ చేస్తానని హెచ్చరించారు.

Mynampally Hanumanth Rao

Mynampally Hanumanth Rao Comments : బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు అన్నారు. తన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. కేసులకు ఎవ్వరూ భయపడే అవసరం లేదన్నారు. తన కార్యకర్తలు అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు.రేపటి నుండి తెలంగాణ మొత్తం తిరుగుతానని చెప్పారు. మెదక్ నియోజకవర్గంకి అన్ని విధాలా అందరం కలిసి అభివృద్ధి చేద్దామని పిలుపు ఇచ్చారు.

తమకు అండదండలుగా ఉన్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానంతో విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలిపారు. మైనంపల్లి ఎవ్వరికీ భయపడడని పేర్కొన్నారు.  పార్టీలో అందరికీ అవే నిబంధనలు ఉండాలన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం.. ఇదెక్కడి పద్ధతి అని నిలదీశారు.

Manikrao Thakre : బీఆర్ఎస్ తో రక్షణ లేదని.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలనుకుంటున్నారు : మాణిక్ రావ్ ఠాక్రే

తాను పార్టీకి విధేయుడిగా పని చేశాను… ఏ పార్టీలో ఉన్న తన తీరు అంతేనని అన్నారు. మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తానని చెప్పారు. పార్టీ అధినేతతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. బీఆర్ఎస్ లో సర్వేల ప్రకారం టికెట్ ల కేటాయింపు జరుగలేదని విమర్శించారు. తనను టార్గెట్ చేస్తేనే… వారిని టార్గెట్ చేస్తానని హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు