Manikrao Thakre: విమానంలో వచ్చి కారులో ఎందుకెళుతున్నారు.. ఠాక్రే ప్రయాణంపై ఆసక్తికర చర్చ!

ప్రతిసారి విమానంలో వచ్చే ఠాక్రే.. తిరుగు ప్రయాణానికి కూడా విమాన టికెట్ తీసుకుని.. చాలాసార్లు రద్దు చేసుకోవడం కూడా కాంగ్రెస్‌లో పెద్ద చర్చకు దారితీస్తోంది.

Manikrao Thakre Visit: మరాఠా నేత మాణిక్రావ్ ఠాక్రే రాష్ట్ర పర్యటన కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ (hot topic) అవుతోంది. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న మాణిక్రావ్ ఠాక్రే సొంత రాష్ట్రం మహారాష్ట్ర.. తెలంగాణ ఇన్‌చార్జిగా ఠాక్రే నియమితులయ్యాక తెలంగాణా టు మహారాష్ట్ర.. (Maharashtra) మహారాష్ట్ర టు తెలంగాణాకు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నారు. హైదరాబాద్ (Hyderabad) కు వచ్చేటప్పుడు విమానంలో వస్తూ.. మహారాష్ట్రకు వెళ్లేప్పుడు మాత్రం రోడ్డు మార్గంలో వెళ్తుండటమే కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఠాక్రే తెలంగాణలో అడుగు పెట్టిన నుంచి ఇదే తీరున తిరుగుతుండటంపై కాంగ్రెస్ క్యాడర్ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ మాణిక్‌రావ్ ఠాక్రే ప్రయాణంపై ఎందుకంత ఆసక్తి? తెరవెనుక (Tera Venuka) ఏం జరుగుతోంది?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే తీరు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆయన ప్రయాణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాణిక్ రావు ఠాక్రే స్వస్థలం మహారాష్ట్ర. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు విమానాల్లో వస్తున్న ఠాక్రే.. హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం రోడ్డు మార్గంలో వెళుతుండటం హాట్‌ డిబేట్‌కు దారితీస్తోంది. మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయిన మాణిక్‌రావ్ ఠాక్రే ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ, మహారాష్ట్ర పక్కపక్కనే ఉండటంతో ఠాక్రేను టీపీసీసీ ఇన్‌చార్జిగా నియమించారు.

ఈ ప్రాంతంపై అవగాహన ఉండటం, స్థానిక రాజకీయాల తీరుతెన్నులు తెలిసిన వ్యక్తికావడంతో ఠాక్రే ఇన్‌చార్జిగా వచ్చిన కొద్దికాలంలోనే టీపీసీసీపై పట్టు సాధించారు. ఎన్నికలు సమీపించడంతో తన సమయం ఎక్కువగా తెలంగాణకే కేటాయిస్తున్నారు. ఐతే ఆయన సొంత ప్రాంతానికి వెళ్లేటప్పుడు రోడ్డు మార్గంలో కారులో ప్రయాణించడం.. అటు నుంచి హైదరాబాద్ కు వచ్చేటప్పుడు మాత్రం విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగుతుండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అసలు ఠాక్రే రోడ్డు మార్గంలో వెళుతూ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కేవీపీపై రేవంత్‌రెడ్డికి కోపమెందుకు.. బీఆర్ఎస్‌కు వచ్చిన ఇబ్బందేంటి?

అంతేకాకుండా ప్రతిసారి విమానంలో వచ్చే ఠాక్రే.. తిరుగు ప్రయాణానికి కూడా విమాన టికెట్ తీసుకుని.. చాలాసార్లు రద్దు చేసుకోవడం కూడా కాంగ్రెస్‌లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అసలు రిటర్న్ జర్నీకి రోడ్డు మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారనే అంశంపై ఎవరికి వారు రకరకాల విషయాలు చెప్పుకుంటున్నారు. ఠాక్రే స్వస్థలం తెలంగాణ సరిహద్దుల్లోనే ఉందట. ఆదిలాబాద్‌కు (Adilabad) 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న యావత్మాల్ అనే గ్రామం ఠాక్రే సొంత ఊరు. ముంబై నుంచి ఎప్పుడు వచ్చినా.. సొంత ఊరిపై మనసు మళ్లడంతోనే ఆయన రిటర్న్ జర్నీకి రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు. మరికొందరు మాత్రం దీని వెనుక టాప్ సీక్రెట్ ఉందని.. ఎన్నికల కోడ్ వచ్చేదాక ఠాక్రే టూర్ ఇలానే సాగుతుందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనా ఠాక్రే టూర్ మాత్రం తెలంగాణా కాంగ్రెస్‌లో ఓ ఆసక్తికర అంశంగా మారిపోయింది.

Also Read: బీఆర్ఎస్‌ పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు గుడ్‌బై.. సీఎం కేసీఆర్ కు రాజీనామా లేఖ

ట్రెండింగ్ వార్తలు