Thummala Nageswara Rao: బీఆర్ఎస్‌ పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు గుడ్‌బై.. పార్టీ అధిష్టానంకు రాజీనామా లేఖ

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు పంపించారు.

Thummala Nageswara Rao : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు పంపించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదములు. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను అంటూ తుమ్మల తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే, సాయంత్రం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే  సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలిసింది.

YS Sharmila: మరోసారి సోనియాగాంధీతో భేటీ కానున్న వైఎస్ షర్మిల.. పార్టీ విలీనంపై క్లారిటి వస్తుందా?

తుమ్మల నాగేశ్వరరావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. టీడీపీలో ఎన్టీఆర్ హయాంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తుమ్మల.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పాలేరు నియోజకవర్గాన్నే అంటిపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో తుమ్మల కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో తుమ్మలపై విజయం సాధించిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిసైతం బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో తుమ్మల వర్సెస్ కందలా వర్గాలుగా ఏర్పడ్డాయి. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం టికెట్ తనకే వస్తుందని తుమ్మల దీమాగా ఉన్నారు. కానీ ,ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవటంతో మనస్థాపానికి గురయ్యారు.

CWC Meeting Hyderabad: CWC సమావేశం కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ

బీఆర్ఎస్ అధిష్టానం పాలేరు నియోజకవర్గం టికెట్ ను తుమ్మలకు కేటయించక పోవటంతో ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పార్టీ మారాలని తుమ్మలపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావును కలవడం, పార్టీలో ఆహ్వానించడంతో కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు తుమ్మల సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తుమ్మలను పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దింపేందుకు పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది.

 

Tummala Nageswara Rao’s resignation letter

ట్రెండింగ్ వార్తలు