YS Sharmila: మరోసారి సోనియాగాంధీతో భేటీ కానున్న వైఎస్ షర్మిల.. పార్టీ విలీనంపై క్లారిటి వస్తుందా?

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయాలని భావిస్తుంది. అయితే, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయనసైతం పాలేరు నియోకవర్గం నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Sonia Gandhi YS Sharmila: హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సందడి మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేతలు ఒక్కొక్కరుగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఇవాళ మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ రానున్నారు. నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణా వేదికగా శనివారం, ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలకోసం హోటల్ తాజ్ కృష్ణలో భారీగా ఏర్పాట్లు చేశారు. సమావేశాలు ముగిసిన తరువాత తుక్కుగూడలో ఆదివారం జరిగే భారీ బహిరంగ సభలో సోనియా, రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. సోనియా గాంధీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల సోనియాగాంధీతో భేటీ కానున్నారు.

CWC Meeting Hyderabad: CWC సమావేశం కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ

గత నెలలో ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీలతో షర్మిల భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ఆర్‌టీపీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. తాజాగా ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు మరోసారి సోనియాతో షర్మిల భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం సోనియాగాంధీ హైదరాబాద్ చేరుకుంటారు. అయితే, సాయంత్రం సమయంలో షర్మిల, సోనియా భేటీ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం. ఈరోజు షర్మిల, సోనియా భేటీ తరువాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసే అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం అయితే.. ఆమె ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే అంశంకూడా ఆసక్తికరంగా మారింది.

Minister Amit Shah: హైదరాబాద్‌కు అమిత్ షా.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు.. పీవీ సింధూతో భేటీ

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయాలని భావిస్తుంది. అయితే, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయనసైతం పాలేరు నియోకవర్గం నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.  తుమ్మలకు పాలేరు నియోజకవర్గం టికెట్ కేటాయిస్తే.. షర్మిలను హైదరాబాద్‌లోని ఓ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిల అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుందని, ఆ మేరకు షర్మిలను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే, ఇవాళ జరిగే షర్మిల, సోనియా భేటీ తరువాత పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు