Apple iPhone Prices : ఆపిల్ లవర్స్‌కు పండగే.. దిగొచ్చిన ఐఫోన్ల ధరలు.. ప్రో మోడల్స్‌పై ఫస్ట్ టైం తగ్గింపు..!

Apple iPhone Prices : ఆపిల్ ఐఫోన్ల ధరలను 3 శాతం నుంచి 4 శాతం తగ్గించింది. ప్రో మోడల్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి.

iPhones become cheaper ( Image Souce : Google )

Apple iPhone Prices : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ల ధరలు దొగొచ్చాయి. ఆపిల్ అందించే మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఐఫోన్ల ధరలను 3 శాతం నుంచి 4 శాతం తగ్గించింది. ఆ తర్వాత కస్టమర్‌లు ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్‌ని కొనుగోలు చేస్తే.. రూ. 5,100 నుంచి రూ. 6వేల వరకు ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15తో సహా ఇతర ఐఫోన్‌లు కూడా రూ. 300 తగ్గుతాయని, ఐఫోన్ ఎస్ఈ మోడల్ రూ. 2300 తగ్గింపుతో వస్తుందని కంపెనీ తెలిపింది.

Read Also : Elon Musk Omelettes : అలా అయితే.. వారం పాటు ఆమ్లెట్ తినడమే మానేస్తా: మస్క్‌ మామ!

ప్రో మోడల్స్‌పై తగ్గింపు ఇదే తొలిసారి :
ఆపిల్ ప్రో మోడల్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి. సాధారణంగా, కొత్త జనరేషన్ ప్రో మోడల్స్ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత కంపెనీ ప్రో మోడళ్లను నిలిపివేస్తుంది. పాత ప్రో మోడల్‌ల ఇన్వెంటరీని మాత్రమే డీలర్లు, రీసెల్లర్‌లు సెలెక్టివ్ డిస్కౌంట్‌ల ద్వారా క్లియర్ చేస్తారు. దీని కారణంగా ప్రో మోడల్‌ల గరిష్ట రిటైల్ ధర (MRP) ఇప్పటివరకు తగ్గించలేదని నిపుణులను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

మొబైల్ ఫోన్లపై 15శాతానికి తగ్గింపు :
ఈ నెల 23న నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2024లో మొబైల్ ఫోన్‌లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 20శాతం నుంచి 15శాతానికి తగ్గించిన తర్వాత ఆపిల్ ఈసారి ప్రో మోడల్స్ ధరలను భారీగా తగ్గించింది. మొబైల్ ఫోన్‌లతో పాటు, కస్టమ్స్ సుంకం కూడా తగ్గించింది.

బడ్జెట్ ప్రకారం.. మొబైల్ ఫోన్‌లు, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లకు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ అవసరం పడుతుంది. ప్రస్తుతం, దేశంలో విక్రయించే దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లకు 18శాతం జీఎస్టీ, 22శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. ప్రాథమిక కస్టమ్స్ సుంకంలో 10శాతం సర్‌ఛార్జ్ అలాగే ఉంటుంది.

కేంద్ర బడ్జెట్ ప్రకారం.. తగ్గింపు తర్వాత మొత్తం కస్టమ్స్ సుంకం 16.5 శాతం (15శాతం బేసిక్, 1.5శాతం సర్‌ఛార్జ్). భారత మార్కెట్లో తయారైన ఫోన్‌ల విషయంలో 18శాతం మాత్రమే జీఎస్టీ విధిస్తుంది. ఆపిల్ విషయానికొస్తే.. ప్రస్తుతం, భారత్‌లో విక్రయిస్తున్న 99శాతం మొబైల్ ఫోన్‌లు స్థానికంగా తయారవుతాయి. అయితే, ఎంపిక చేసిన హై-ఎండ్ మోడల్‌లు మాత్రమే దిగుమతి అవుతున్నాయి.

Read Also : Elon Musk : ఆ ‘వోక్‌మైండ్ వైరస్’ నా కొడుకును బలి తీసుకుంది.. నన్ను మభ్యపెట్టారంటూ మస్క్ భావోద్వేగం!

ట్రెండింగ్ వార్తలు