Nothing Phone 2a Special Edition : నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ ఇదిగో.. కలర్ ఫుల్ డిజైన్ అదుర్స్.. ధర ఎంతో తెలుసా?

Nothing Phone 2a Special Edition : నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 27,999కు పొందవచ్చు. లిమిటెడ్-టైమ్ ఆఫర్‌గా రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు.

Nothing Phone 2a Special Edition : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ నథింగ్ కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెడ్, ఎల్లో, బ్లూ కలర్ ఆప్షన్లతో ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. సింగిల్ 12జీబీ ర్యామ్+ 256జీబీ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. దేశంలో జూన్ మొదటి వారంలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త డిజైన్ కాకుండా, నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ హార్డ్‌వేర్ వివరాలు మార్చి నుంచే అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రామాణిక నథింగ్ ఫోన్ 2ఎ మీడియాటెక్ డైమన్షిటీ 7200ప్రో ఎస్ఓసీపై రన్ అవుతుంది. డ్యూయల్ బ్యాక్ కెమెరాలను అమర్చారు.

Read Also : Lava Yuva 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా యువ 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 9499 మాత్రమే!

భారత్‌లో నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ ధర :
నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 27,999కు పొందవచ్చు. లిమిటెడ్-టైమ్ ఆఫర్‌గా రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు. దాంతో ఈ నథింగ్ ఫోన్ రూ. 26,999 ధరకు కొనుగోలు చేయొచ్చు. వచ్చే జూన్ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్‌ను లండన్‌లోని నథింగ్ సోహో స్టోర్ నుంచి జూన్ 1 ఉదయం 11:00 గంటల నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు.

నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ డిజైన్ :
నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ రెగ్యులర్ మోడల్‌లోని వైట్ కలర్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ, బ్యాక్ ప్యానెల్‌లో రెడ్, ఎల్లో, బ్లూ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. బ్రాండ్ డిజైన్‌ కెమెరా మాడ్యూల్, లోయర్ బ్యాక్ చుట్టూ గ్రే కలర్ సెక్షన్‌లను కలిగి ఉంది. నథింగ్ బ్రాండ్ అన్ని నథింగ్ ఆడియో ప్రొడక్టుల నుంచి రైట్ ఇయర్‌బడ్‌లో రెడ్, కొత్త ఇయర్ (ఎ) లో ఎల్లో, నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ బ్లూ వెర్షన్‌లో బ్లూ కలర్ ఆప్షన్ ఉపయోగించింది.

నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,412 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేను 30హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ కలిగి ఉంది. హుడ్ కింద, స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200ప్రో ఎస్ఓసీ 12జీబీ ర్యామ్‌తో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ 1/1.56-అంగుళాల పరిమాణంతో 50ఎంపీ సెన్సార్, 50ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఐపీ54-రేటెడ్ డస్ట్, వాటర్-రెసిస్టెంట్ బిల్డ్‌, ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఫేస్ అన్‌లాక్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 2ఎ 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : Moto G04s Launch : మోటో G04s ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. భారత్‌లో ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు