Whatsapp Video Controls : యూట్యూబ్‌లోనే కాదు భయ్యా.. వాట్సాప్‌లోనూ వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్స్..!

Whatsapp Video Controls : వాట్సాప్‌ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ ప్లేబ్యాక్ కంట్రోల్స్ మాదిరిగానే యాప్‌లోని వీడియో ప్లేబ్యాక్‌పై యూజర్లకు మరింత కంట్రోల్ అందించనుంది.

Whatsapp Video Controls : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ (Whatsapp) సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లను ప్రవేశపెడుతోంది. యూజర్లు కోరుకునే ఫీచర్లను అందించడంపై మెటా ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. స్క్రీన్‌షాట్‌లను వ్యూ మోడ్‌లో బ్లాక్ చేయడం నుంచి గ్రూప్ కాల్‌లలో 31 మంది పాల్గొనేవారిని అనుమతించడం వరకు అనేక కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ ఫీచర్లు యూజర్లు, వాట్సాప్ వ్యాపారాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

10 సెకన్ల పాటు వీడియోను అటు ఇటు ఫార్వార్డ్ చేయొచ్చు : 
వాట్సాప్ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. యాప్‌లోని వీడియో ప్లేబ్యాక్‌పై యూజర్లను మరింత కంట్రోల్ ఇస్తుంది. యూట్యూబ్ ప్లేబ్యాక్ కంట్రోల్స్ మాదిరిగానే ప్రోగ్రెస్ బార్‌ని ఉపయోగించకుండానే వీడియోలను రివైండ్, ఫాస్ట్ ఫార్వార్డ్ చేసే సామర్థ్యాన్ని ఈ ఫీచర్ యూజర్లను అందిస్తుంది. లేటెస్ట్ వాట్సాప్ అప్‌డేట్స్ ట్రాక్ చేసే వెబ్‌సైట్ (WABetaInfo) ప్రకారం.. కొత్త వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్ యూజర్లను 10 సెకన్ల పాటు ముందుకు, వెనుకకు ఫార్వార్డ్ చేసేందుకు అనుమతిస్తాయి. ఇందులోని కొత్త బటన్‌లు యూట్యూబ్‌లోని వీడియో కంట్రోల్స్ మాదిరిగానే ఉంటాయి.

మరో కొత్త ప్రైవసీ ‘ఆల్టర్నేట్ ప్రొఫైల్’ ఫొటో ఫీచర్ :
ఈ కొత్త వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్స్ ప్రస్తుతం (Android 2.23.24) వాట్సాప్ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని నివేదిక పేర్కొంది. అయితే, భవిష్యత్ యాప్ అప్‌డేట్‌లలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. అధికారికంగా రిలీజ్ చేసే కచ్చితమైన తేదీ రివీల్ చేయలేదు. ఈ కంట్రోల్స్ ద్వారా యూజర్లు వీడియోలోని అవసరమైన చోటకు మారేందుకు సులభతరం చేస్తాయి. ప్రోగ్రెస్ బార్‌ను స్క్రబ్ చేయడం కన్నా చాలా సులభంగా ఉంటుంది. వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్ ఫీచర్‌తో పాటుగా, వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో వంటి డేటాను హైడ్ చేసి వారి కాంటాక్ట్ లిస్ట్‌లో లేని కాంటాక్ట్‌ల కోసం వేరే ఫొటో, పేరుని సెట్ చేయడానికి యూజర్లను అనుమతించే కొత్త ప్రైవసీ-ఫోకస్డ్ ‘ఆల్టర్నేట్ ప్రొఫైల్’ని కూడా డెవలప్ చేస్తోంది.

Read Also : Whatsapp Channel Updates : మీ వాట్సాప్ ఛానల్ అప్‌డేట్స్ ఎలా ఫార్వార్డ్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్

వాట్సాప్ నివేదిక (WABetaInfo) ప్రకారం.. ‘ఆల్టర్నేట్ ప్రొఫైల్ ఫీచర్’ యూజర్ల ప్రొఫైల్ ఫొటో ప్రైవసీ సెట్టింగ్‌లలో విలీనం చేయనుంది. వినియోగదారులు తమ ప్రాథమిక ప్రొఫైల్ సమాచారాన్ని అందరి నుంచిహైడ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. నిర్దిష్ట కాంటాక్టల కోసం వేరే ప్రొఫైల్ ఫొటో, పేరును సెట్ చేయడానికి అనుమతిస్తుంది. ఆల్టర్నేట్ ప్రొఫైల్ ఫీచర్ ఇంకా టెస్టింగ్ స్టేజీలో ఉంది. బీటా టెస్టర్‌లకు కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ఫ్యూచర్ యాప్ అప్‌డేట్‌లో ఈ ఫీచర్ రిలీజ్ కానుంది. అందుబాటులో ఉన్న యూజర్లు ఆల్టర్నేట్ ప్రొఫైల్ ఫీచర్‌ను పొందిన తర్వాత ఈ కింది విధంగా ప్రయత్నాంచాలి.

WhatsApp new video control features

ఆల్టర్నేట్ ప్రొఫైల్ ఇలా సెటప్ చేసుకోండి :
* వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* Settings > Privacy > Profile Photo ఆప్షన్‌కు వెళ్లండి.
* మీ ప్రైమరీ ప్రొఫైల్ ఫొటో వ్యూను మీ కాంటాక్టులకు మాత్రమే పరిమితం చేసేందుకు ‘My Contacts’ని ఎంచుకోండి.
* వేరే ఫొటో, పేరుతో ఆల్టర్నేట్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయండి.
* ఆల్టర్నేట్ ప్రొఫైల్ మీకు కావలసిన యూజర్లకు మాత్రమే కనిపించేలా చూసే సెట్టింగ్‌లను ఎడ్జెస్ట్ చేయండి.
* ఈ కొత్త ఫీచర్ వారి సమాచారంపై మరింత కంట్రోల్ కలిగి ఉండాలని, వారి ప్రొఫైల్‌లను అందరితో షేర్ చేయకుండా ఉండాలనుకునే యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.

Read Also : Whatsapp Block : వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడం ఎలా? ఇదిగో సింపుల్ టిప్స్..!

ట్రెండింగ్ వార్తలు