WhatsApp Login : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఫోన్ నెంబర్‌ లేకుండానే లాగిన్ చేయొచ్చు!

WhatsApp Login : వాట్సాప్ ఇమెయిల్ వెరిఫికేషన్ ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది. వినియోగదారులు వారి ఫోన్ నంబర్‌లకు యాక్సస్ లేకుండా వారి అకౌంట్లలో లాగిన్ చేయలేరు.

WhatsApp Login : కొత్త ఫోన్ కొన్నారా? మీరు SMS ద్వారా OTP వెరిఫికేషన్‌తో మీ వాట్సాప్ అకౌంట్లతో కనెక్ట్ చేయవచ్చు. అయితే మీ ఫోన్ నంబర్ యాక్టివ్‌గా లేకున్నా లేదా మీ ఫోన్ దొంగిలిస్తే ఏమి చేయాలి? వాట్సాప్ SMS వెరిఫికేషన్ సురక్షితమైనది. OTP లేకుండా మీ అకౌంట్లలో ఎవరూ లాగిన్ చేయలేరు. అయితే, మరో సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గం లేదనే చెప్పాలి. మీకు మీ ఫోన్ నంబర్‌కు యాక్సెస్ లేకపోతే.. మీరు SMSని స్వీకరించలేరు. మీరు వాట్సాప్ లాగిన్ చేయలేరు. అయితే, ఇప్పుడు వాట్సాప్ ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది.

Read Also : Gmail Bulk Messages : మీ జీమెయిల్ స్టోరేజీ ఫుల్ అయిందా? సింగిల్ క్లిక్‌తో బల్క్ మెసేజ్‌లన్నీ డిలీట్ చేసుకోవచ్చు..!

(WABetaInfo) ప్రకారం.. కంపెనీ వారి ఫోన్ నంబర్‌తో పాటు ఇమెయిల్‌ను ఉపయోగించి వారి అకౌంట్లలో లాగిన్ చేయడానికి యూజర్లను అనుమతించే ఇమెయిల్ వెరిఫికేషన్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుత వెరిఫికేషన్ ప్రక్రియకు అదనంగా ఉంటుంది. SMS వెరిఫికేషన్ యూజర్లు SMS ద్వారా 6-అంకెల OTPని అందుకోలేకపోతే వారి అకౌంట్లకు లాగిన్ చేయడంలో సాయపడేందుకు ప్రత్యామ్నాయ పద్ధతిగా ఉపయోగపడుతుంది.

వాట్సాప్ ‘ఇమెయిల్ వెరిఫికేషన్’ ఫీచర్ ప్రస్తుతం Android, iOS కోసం బీటా వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు కొత్తగా యాడ్ చేసిన అకౌంట్ సెట్టింగ్‌ల విభాగంలో కనుగొనవచ్చు. షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. వాట్సాప్ ఇమెయిల్ వెరిఫికేషన్ ఫీచర్ సెటప్ చేయడం సులభంగా ఉంటుంది. వినియోగదారులు వారి ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయగల ఫీల్డ్‌ను కలిగి ఉంది. ఫీల్డ్ పక్కన ఉన్న టెక్స్ట్ యూజర్ల ఇమెయిల్ అడ్రస్ ఇతరులకు కనిపించవని వాట్సాప్ అకౌంట్లను యాక్సెస్ చేయడానికి వెరిఫికేషన్ సిస్టమ్ వారికి సాయపడుతుందని వివరిస్తుంది.

WhatsApp users to login to their account 

వినియోగదారులు వారి ఇమెయిల్ అడ్రస్‌లను ఎంటర్ చేసిన తర్వాత వాటిని ధృవీకరించాలి. వినియోగదారులు వారి ఇమెయిల్ అడ్రస్‌లను ధృవీకరించకపోతే, అలా చేయమని ప్రాంప్ట్ చేయొచ్చు. వెరిఫికేషన్ ఇమెయిల్‌ను మళ్లీ పంపడానికి క్లిక్ చేయగల బటన్ కనిపిస్తుంది. వాట్సాప్ చాలా కాలంగా కొత్త ఇమెయిల్ వెరిఫికేషన్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. లేటెస్ట్ బీటా వెర్షన్ 2.23.24.10 అప్‌డేట్ మరింత మందికి అందుబాటులో ఉంచింది. యాప్ బీటా వెర్షన్‌ని ఉపయోగిస్తున్న కొద్ది మంది యూజర్లకు మాత్రమే ఇప్పటికీ అందుబాటులో ఉండగా, వాట్సాప్ త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ సమయంలో, వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ భద్రతను మెరుగుపరచడానికి అనేక ఇతర ఫీచర్లపై కూడా పని చేస్తోంది. మీ ప్రధాన ప్రొఫైల్ ఫొటోను AI-ఆధారిత సపోర్టు చాట్‌ను చూడకుండా కంట్రోల్ చేసేలా యూజర్లకు అల్ట్రానేట్ ప్రొఫైల్‌లను డెవలప్ చేస్తోంది. బాటమ్ నావిగేషన్ బార్, మెసేజ్ బబుల్స్ కోసం కొత్త కలర్ స్కీమ్‌ల వంటి లార్జ్ వ్యూ మార్పులను కూడా వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. ఈ అప్‌డేట్‌లతో రాబోయే నెలల్లో వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత మెరుగ్గా ఉండొచ్చు.

Read Also : AI Voice Cloning Scam : స్కామర్లతో జాగ్రత్త.. ఈ ఏఐ వాయిస్ క్లోనింగ్ ట్రిక్‌తో సెకన్లలో ఎవరిదైనా ఫేక్ వాయిస్‌లను క్రియేట్ చేయొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు