Xiaomi 14 Ultra Battery : షావోమీ 14 అల్ట్రా ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే బ్యాటరీ వివరాలు లీక్..!

Xiaomi 14 Ultra : షావోమీ కొత్త 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ కొత్త హై-ఎండ్ ఫీచర్‌లు, 5180ఎంఎహెచ్ బ్యాటరీతో రానుంది. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Xiaomi 14 Ultra battery : ప్రముఖ షావోమీ కొత్త 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ షావోమీ ప్యాడ్ 7 ప్రో టాబ్లెట్‌తో పాటు లాంచ్ చేయాలని యోచిస్తోంది. మొబైల్ డివైజ్‌లను గుర్తించే డేటాబేస్ అయిన ఐఎంఈఐ లిస్టింగ్‌లో 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు ఉన్నాయి. ఈ జాబితాలో మోడల్ నంబర్‌, డివైజ్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే విషయాన్ని వెల్లడించింది. చైనాలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ అల్ట్రా ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

భారత్ మార్కెట్లోకి వచ్చే అవకాశం లేదా? :
అయితే, షావోమీ గత ఫోన్ల రిలీజ్ మాదిరిగానే ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టకపోవచ్చని తెలుస్తోంది. ఈ రాబోయే షావోమీ డివైజ్ బ్యాటరీ సామర్థ్యం గురించి వివరాలను ఒక నివేదిక వెల్లడించింది. షావోమీ ఫోన్‌లో 5180ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుందని డిజిటల్ చాట్ స్టేషన్ వెయిబోలో షేర్ చేసింది. 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగిన షావోమీ 13 అల్ట్రా కన్నా కొత్త 14 అల్ట్రా పెద్ద బ్యాటరీని కలిగి ఉండవచ్చునని గతంలో లీక్ డేటా తెలిపింది. కానీ, కొన్ని నివేదికలు మాత్రం 5500ఎంఎహెచ్ బ్యాటరీ అని సూచించాయి.

Read Also : Ola S1 X Plus Price Cut : ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 20వేల ధర తగ్గింపు.. డోంట్ మిస్!

షావోమీ 14 అల్ట్రా టెక్ ఔత్సాహికులకు అత్యుత్తమ ఫీచర్లను అందిస్తుంది. దీని డిస్‌ప్లే స్పష్టమైన 2కె రిజల్యూషన్, వేగవంతమైన 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.7-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో పవర్‌ఫుల్ విజువల్స్, మృదువైన నావిగేషన్‌ను కలిగి ఉంటుంది.

ఈ డివైజ్‌కు పవర్ అందించే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 750 జీపీయూతో వస్తుంది. గేమింగ్ నుంచి మల్టీ టాస్కింగ్ వరకు వివిధ పనులకు సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్‌ఓఎస్‌పై రన్ అవుతోంది. అప్‌డేట్ చేసిన యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

Xiaomi 14 Ultra battery details 

షావోమీ 14 అల్ట్రా ఫోన్ ఫీచర్లు (అంచనా) :
12జీబీ లేదా 16జీబీ ఆకట్టుకునే ర్యామ్ ఆప్షన్లు, 256జీబీ నుంచి భారీ 1టీబీ వరకు స్టోరేజ్ వేరియంట్‌లతో వినియోగదారులు ఫైల్‌లు, యాప్‌లు, మల్టీమీడియా కంటెంట్‌ను స్టోర్ చేయడానికి తగినంత స్టోరేజీని పొందవచ్చు. ఈ డివైజ్ అధునాతన కెమెరా సెటప్‌తో వస్తుంది.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన హై-రిజల్యూషన్ 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-900 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 50ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50ఎంపీ టెలిఫోటో లెన్స్, అదనపు సోనీని కలిగి ఉంటుంది. ఎల్ఐటీ900 సెన్సార్, అద్భుతమైన ఫోటోగ్రఫీ, మల్టీఫేస్ సైన్ కలిగి ఉంటుంది. ముందు భాగంలో, హై-క్వాలిటీతో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32ఎంపీ లెన్స్ కూడా ఉంది.

ప్రత్యేకమైన ఫీచర్లలో 5500ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఒకటి. స్విఫ్ట్ 120డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, సౌకర్యవంతమైన 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.అదనంగా, ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్‌ను అందిస్తుంది. మెరుగైన భద్రత, సులభంగా అన్‌లాకింగ్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్‌లతో షావోమీ 14 అల్ట్రాను పవర్‌హౌస్ డివైజ్‌గా కనిపిస్తుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా టాప్ రేంజ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

Read Also : Bajaj Chetak Urbane Launch : రూ. 1.15 లక్షల ధరతో బజాజ్ చేతక్ అర్బేన్ ఈవీ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 63కి.మీ దూసుకెళ్తుంది

ట్రెండింగ్ వార్తలు