Nag Ashwin : భార్య, వదినలతో దిగిన ఫోటో షేర్ చేసి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన కల్కి డైరెక్టర్..

తాజాగా కల్కి ఇంత పెద్ద హిట్ అవ్వడంతో నాగ్ అశ్విన్ తన భార్య ప్రియాంక దత్, వదిన స్వప్న దత్ లతో దిగిన ఫోటో షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

  • Updated on- July 1, 2024 / 11:55 AM IST

Nag Ashwin shares an emotional post with a photo of Priyanka Dutt and Swapan Dutt after Kalki hit

Nag Ashwin : ప్రభాస్ కల్కి సినిమా ఎంత భారీ విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్స్ దాటి దూసుకుపోతుంది. ఈ సినిమాలో ప్రతి సీన్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంత గొప్ప సినిమా రావడానికి ముఖ్య కారణం దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి సినిమా సాంకేతికంగా కూడా చాలా బాగుండటంతో నాగ్ అశ్విన్ ని అందరూ అభినందిస్తున్నారు.

కల్కి నిర్మాత అశ్విని దత్ చిన్న కూతురు ప్రియాంక దత్, నాగ్ అశ్విన్ భార్యాభర్తలని తెలిసిందే. వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక ప్రియాంక దత్, స్వప్న దత్ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కూడా ఇప్పుడు నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. తాజాగా కల్కి ఇంత పెద్ద హిట్ అవ్వడంతో నాగ్ అశ్విన్ తన భార్య ప్రియాంక దత్, వదిన స్వప్న దత్ లతో దిగిన ఫోటో షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

Also Read : Kalki Bujji Vehicle : చిన్ని సైజ్ రోబోటిక్ ‘బుజ్జి’ని తయారుచేసిన ఇంజనీర్.. ఎలా చేయాలో కూడా చెప్పేసాడు..

నాగ్ అశ్విన్ తన పోస్ట్ లో.. సుమారు పదేళ్ల క్రితం మేము ముగ్గురం కలిసి మా మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ప్రారంభించాము. అప్పుడు వైజయంతి సంస్థ కష్టాల్లో ఉంది. ఆ సినిమా రిస్క్ చేసి తీస్తున్నాము. నాకు బాగా గుర్తు ఒక రోజు 20 మందిని ఎక్స్‌ట్రాగా తీసుకొచ్చి షూట్ చేసాము. అయితే ఆ రోజు వర్షం పడి షూట్ ఆగిపోయింది. ఆ వర్షం వల్ల మొత్తం సెటప్ మొత్తం మళ్ళీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఖర్చు ఎక్కువైంది. దానికి మేము భయపడ్డాము. ఇప్పుడు పదేళ్ల తర్వాత మేము కలిసి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవ్వడమే కాక సినిమా చరిత్రలో ఒక గుర్తింపుతో నిలిచాయి. ఈ ఇద్దరి సపోర్ట్ నాకు ఉండటం నేను గర్వపడుతున్నాను. సాధించలేని విషయాలని సాధించి చూపించాము. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ముందు ముందు చాలా ఇంప్రూవ్ చేసుకుంటాం. ప్రస్తుతానికి కృతజ్ఞతలు అని పోస్ట్ చేశాడు. దీంతో నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్ గా మారింది.