Kalki Bujji Vehicle : చిన్ని సైజ్ రోబోటిక్ ‘బుజ్జి’ని తయారుచేసిన ఇంజనీర్.. ఎలా చేయాలో కూడా చెప్పేసాడు..

ఓ రోబోటిక్ ఇంజనీర్ తాజాగా చిన్న సైజు బుజ్జి వెహికల్ ని తయారుచేసాడు.

Kalki Bujji Vehicle : చిన్ని సైజ్ రోబోటిక్ ‘బుజ్జి’ని తయారుచేసిన ఇంజనీర్.. ఎలా చేయాలో కూడా చెప్పేసాడు..

Robotic Engineer Made Small Size Bujji Vehicle of Kalki Prabhas Bujji Vehicle

Kalki Bujji Vehicle : కల్కి సినిమాలో ప్రభాస్ నడిపిన బుజ్జి వెహికల్ అందరికి నచ్చేసింది. నాగ్ అశ్విన్ చాలా కొత్త ఆలోచనతో మహీంద్రా కంపెనీ సహకారంతో ఈ బుజ్జి వెహికల్ ని దాదాపు 6 కోట్లు ఖర్చుపెట్టి తయారుచేశారు. సినిమాలో బుజ్జి చేసే యాక్షన్ సీన్స్ అందరిని మెప్పించాయి. పిల్లలకు అయితే బుజ్జి వెహికల్ బాగా నచ్చేసింది. ఈ వెహికల్ కి కీర్తి సురేష్ వాయిస్ పెట్టి, దానితో కామెడీ చేయించి నవ్వించారు కూడా.

Also Read : Kalki Ticket Rates : ‘కల్కి’ సినిమా టికెట్ రేట్లు తగ్గుతాయా?

అయితే ఇలాంటి ఫేమస్ వెహికల్స్ వచ్చినప్పుడు వాటికి బొమ్మల రూపంలో మార్కెట్లో చాలా వస్తాయి. అవి కేవలం పిల్లలు ఆడుకోడానికి సింపుల్ గా ఎలాంటి మెకానిజం లేకుండా తయారుచేస్తారు. అయితే ఓ రోబోటిక్ ఇంజనీర్ తాజాగా చిన్న సైజు బుజ్జి వెహికల్ ని తయారుచేసాడు. తనకున్న రోబిటిక్ నాలెడ్జి, కోడింగ్ నాలెడ్జి ఉపయోగించి అచ్చం కల్కి సినిమాలో కనపడిన బుజ్జి వెహికల్ లాగే తయారుచేసాడు. అంతే కాకుండా ఈ రోబోటిక్ బుజ్జిని ఎలా తయారుచేయాలో కూడా వీడియోల రూపంలో చెప్పాడు. ఈ బుజ్జి ఆపరేటింగ్ కి కావాల్సిన కోడింగ్ కూడా ఇచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by SD Parvez Hussain (@engineerfromindia)

దీంతో ఈ బుజ్జి వీడియోలు వైరల్ గా మారాయి. అచ్చం కల్కి బుజ్జి వెహికల్ లాగే చిన్న సైజ్ బుజ్జిని భలే తయారుచేసాడు అంటూ దీనిని చేసిన ఇంజనీర్ పర్వేజ్ హుస్సేన్ ని అభినందిస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఈ వెహికల్ లో ఉండే కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చిన చిన్న బుజ్జి రోబోని తయారుచేసే పనిలో పడ్డాడు. పలువురు అభిమానులు, నెటిజన్లు.. బుజ్జి వెహికల్ ని ఇతను భలే తయారుచేసాడని, ఈ వీడియోలు మూవీ టీమ్ వరకు వెళ్లాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి అతను షేర్ చేసిన వీడియోలతో మీరు కూడా బుజ్జి ఎలా తయారు చేయాలో ట్రై చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో చూసేయండి.