Kalki Ticket Rates : ‘కల్కి’ సినిమా టికెట్ రేట్లు తగ్గుతాయా?

కల్కి సినిమాకు టికెట్ రేట్లు భారీగా పెంచిన సంగతి తెలిసిందే.

Kalki Ticket Rates : ‘కల్కి’ సినిమా టికెట్ రేట్లు తగ్గుతాయా?

Kalki 2898AD Ticket Rates Decreasing Discussions based on Collections in Week Days

Updated On : July 1, 2024 / 7:58 AM IST

Kalki Ticket Rates : ప్రభాస్ కల్కి సినిమా ప్రేక్షకులని మెప్పించి సూపర్ హిట్ అయింది. థియేటర్స్ లో కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది కల్కి సినిమా. సినిమాలోని యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, కలియుగాంతం విజువల్స్.. అన్ని ప్రేక్షకులని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. నాగ్ అశ్విన్ అదిరిపోయే సినిమా తీసాడని ప్రేక్షకులు, అభిమానులతో పాటు అన్ని సినీ పరిశ్రమల సెలబ్రిటీలు అభినందిస్తున్నారు.

ఇప్పటికే కల్కి సినిమా 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే కల్కి సినిమాకు టికెట్ రేట్లు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. రేట్లు మరీ ఎక్కువగా పెంచారని దీనిపై కొంతమంది విమర్శలు కూడా చేసారు. అయితే ఈ నాలుగు రోజులు సినిమా రిలీజ్, వీకెండ్ కాబట్టి ప్రేక్షకులు, అభిమానులు వచ్చారు.

Also Read : Pushpa 2 – HariHara Veeramallu : డిప్యూటీ సీఎం డేట్స్ ఇస్తే.. ‘పుష్ప 2’కు పోటీగా ‘హరిహర వీరమల్లు’..

అసలైన పరీక్ష ఇవాళ్టి నుంచి ఉంటుంది. నేడు సోమవారం నుంచి కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ మెయింటైన్ చేస్తే ఓకే. లేదా కలెక్షన్స్ తగ్గుముఖం కనిపిస్తే టికెట్ రేట్లు తగ్గించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. కలెక్షన్స్ లో తగ్గుముఖం కనిపిస్తే కనీసం సింగిల్ స్క్రీన్స్ వరకు అయినా టికెట్ రేట్లు తగ్గిస్తారని తెలుస్తుంది. చూడాలి మరి కల్కి సినిమా వీక్ డేస్ లో ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో.