ఆ డబ్బు ఎక్కడికి పోయిందో తెలియడం లేదు..! పింఛన్ల పంపిణీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

వాలంటీర్స్ లేకపోతే పింఛన్ల పంపిణీ ఆగిపోతాయి అని భయపెట్టారు.. ఇప్పుడు ఎక్కడైనా పింఛన్ పంపిణీ ఆగిపోయిందా? అంటూ పవన్ ప్రశ్నించారు.

Deputy CM Pawan Kalyan : ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ర్యాలీలు నిర్వహించడం నాకు ఇష్టం ఉండదు. ఆ విలువైన సమయాన్ని నాకు వచ్చిన బాధ్యత మీద పెడతాను. నేను తీసుకున్న శాఖలో చాలా కీలకమైన శాఖలు. నేను తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేద్దాం అనుకుంటున్నానని పవన్ అన్నారు.

Also Read : CM Chandrababu : మంగళగిరిలో లోకేశ్ గెలుపుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మనం గత ప్రభుత్వాన్ని విమర్శించాము.. ఇప్పుడు మనకు ఛాలెంజ్ ఏమిటంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. పింఛన్ ను మేము పెంచి ఇచ్చాం. చంద్రబాబు అనుభవం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా పింఛన్ ఇవ్వగలిగాం.. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలి. ఏ పార్టీ వాళ్ళైనా మీకు పింఛన్ ఇవ్వటం ఈ ప్రభుత్వం బాధ్యత. గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్ అనే ఒక ప్రైవేటు సంస్థని ఏర్పాటు చేసింది. వాలంటీర్స్ లేకపోతే పింఛన్ల పంపిణీ ఆగిపోతాయి అని భయపెట్టారు.. ఇప్పుడు ఎక్కడైనా పింఛన్ పంపిణీ ఆగిపోయిందా? అంటూ పవన్ ప్రశ్నించారు. ఉదయం 6 గంటలకు మొదలుపెడితే రాత్రి సమయానికి అన్ని ప్రాంతాల్లో పంపిణీ పూర్తవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి మరీ పెన్షన్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి మీ ఇంటికి వచ్చి మీకు పింఛన్ డబ్బులు ఇచ్చే సమయంలో డబ్బులు అడగడానికి లేదు. కానీ, ప్రైవేటు ఉద్యోగులు అడగడానికి ఉంది. ఎవ్వరు డబ్బులు అడిగినా కూటమి పార్టీ అభ్యర్థుల దృష్టికి తీసుకువెళ్లండి.. లేకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకురండి చర్యలు తీసుకుంటాం అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Also Read: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ.. సభలో నవ్వులేనవ్వులు

పంచాయతీరాజ్ నిధులు చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయాయో కూడా తెలియడం లేదు. శాఖలో ఎన్ని వేలకోట్లు అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. అసలు ఏ హెడ్ కింద ఏ అప్పులు ఉన్నాయో కూడా అర్థం కావడం లేదు. 600 కోట్లు పెట్టి రుషికొండలో ఒక విలాసవంతమైన భవనం మాత్రం గత ప్రభుత్వం కట్టించింది. అదే 600 కోట్లు ఉంటే ఒక జిల్లా అభివృద్ధి చెందేది అని పవన్ కల్యాణ్ అన్నారు. నా సైడ్ నుండి ఎటువంటి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను అభివృద్ధి చేస్తాం. పంచాయతీరాజ్ శాఖలో చూస్తే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి ని అందించాలి. మన గోదావరి జిల్లాల చుట్టూ నీళ్లు ఉన్నాయి. కానీ, తాగడానికి మాత్రం లేవు. ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడంకోసం కేంద్రాన్ని డబ్బులు అడగాలేగానీ ఎన్నైనా ఇస్తారని పవన్ అన్నారు. నేను జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నాను.. రాష్ట్రంలో నిధులు చూస్తే తీసుకోకూడదని అనుకుంటున్నాను. జీతం అవసరం లేదు. మా దేశంకోసం, నా నేలకోసం నేను పని చేస్తానని పవన్ అన్నారు.

Also Read : అరకు కాఫీపై ప్రధాని మోదీ ప్రశంసలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

నేను అద్భుతం చేస్తానని చెప్పలేదు. కానీ, నేను జవాబు దారితనంతో పనిచేస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో మొదట మన పిఠాపురం నుండి రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తాం. అదేవిధంగా పారిశుద్ధ్య సమస్యను తొలగించే విధంగా పనులు ప్రారంభిస్తాం. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి పిఠాపురం ప్రజల మన్ననలు పొందిన తరువాత విజయాత్ర చేస్తానని పవన్ అన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ప్రస్తుతం మనం వ్యవస్థల్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. వ్యవస్థను చంపేస్తున్నారు.. వ్యక్తులు పెరుగుతున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైడ్ చేస్తే ఎన్ని అక్రమాలు బయటకు వచ్చినయో ఒకసారి చూడండి అంటూ పవన్ అన్నారు.

ఒక్కో సెక్షన్ లో నాలుగేసి గంటలు కూర్చుంటే ఎన్నెన్ని కోట్లు పోయాయో తెలుస్తుంది. నా 20 సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక గంటసేపు ఏకదాటిగా కూర్చోలేదు. ప్రజల సొమ్ముకోసం.. అవి ఎక్కడికి పోయాయో తెలుసుకునేందుకు ఒక్కో సెక్షన్ లో నాలుగేసి, ఐదేసి గంటలు కూర్చొని సమీక్షలు చేస్తున్నానని పవన్ చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు