Manchu Lakshmi : అప్పుడు రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను.. మా అందరికి కలిపి వాట్సాప్ గ్రూప్ ఉంది.. మంచు లక్ష్మి వ్యాఖ్యలు..

తాజాగా మంచు లక్ష్మి బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Manchu Lakhsmi Interesting Comments on Ram Charan in Bollywood Interview

Manchu Lakshmi : మంచు లక్ష్మి మోహన్ బాబు కూతురిగా తెలుగులో పలు సినిమాలు చేసి మెప్పించినా ఇపుడు బాలీవుడ్ మీద ఫోకస్ చేసింది. ఇటీవల ముంబైకి షిఫ్ట్ అయి అక్కడ ఒక కొత్త అపార్ట్మెంట్ తీసుకొని అక్కడే ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆఫర్ల కోసం ట్రై చేస్తుంది మంచు లక్ష్మి. ఇటీవలే యక్షిణి సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మంచు లక్ష్మి బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నేను ఇక్కడ ముంబైకి షిఫ్ట్ అయినప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. నేను అప్పుడు రామ్ చరణ్ ఇంట్లో ఉండేదాన్ని. ఆ విషయం ఎవరికీ తెలీదు కూడా. రామ్ చరణ్ ని కూడా ఎవరికీ చెపొద్దు అని చెప్పాను. ఇప్పుడు నేను అపార్ట్మెంట్ తీసుకున్నాక షిఫ్ట్ అయ్యాను అని తెలిపింది. మంచు – మెగా ఫ్యామిలీ అనుబంధం గురించి తెలిసిందే. వీరి మధ్య ఉన్న స్నేహంతోనే మంచు లక్ష్మి చరణ్ ని అడిగి తాను ముంబైలో అపార్ట్మెంట్ తీసుకునేవరకు అక్కడ చరణ్ ఇంట్లో ఉంది.

Also Read : VN Aditya : అగ్ర నిర్మాణ సంస్థపై దర్శకుడు షాకింగ్ కామెంట్స్.. నా సినిమాలు ఎప్పుడు రిలీజ్..? నాలుగేళ్లుగా ఓపిక నశించి..

అయితే ఇదే ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం కూడా తెలిపింది. లక్ష్మి మాట్లాడుతూ.. నేను, రానా, చరణ్.. ఇలా ఆల్మోస్ట్ 142 మంది యాక్టర్స్ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మా సినిమాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇందులో పోస్ట్ చేస్తాం. నేను, చరణ్, రానా.. మేమంతా చిన్నప్పట్నుంచి కలిసి పెరిగినవాళ్ళమే అని చెప్పింది. దీంతో మంచులక్ష్మీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ గ్రూప్ లో ఇంకెవరెవరు ఉన్నారో అని అడుగుతున్నారు నెటిజన్లు.