Coolie Collections : తమిళ సినిమాల రికార్డ్ బద్దలు కొట్టిన రజినీకాంత్.. కెరీర్ హైయెస్ట్.. కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్..
తాజాగా మూవీ యూనిట్ కూలీ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించింది.

Coolie Collections
Coolie Collections : రజినీకాంత్ మెయిన్ లీడ్ లో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌభిన్, సత్యరాజ్, శృతిహాసన్ కీలక పాత్రల్లో లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా నిన్న ఆగస్టు 14న రిలీజయి ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాకు ఉన్న హైప్ తో, హాలిడేస్ ఉండటంతో బుకింగ్స్ మాత్రం అదిరిపోతున్నాయి. కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాదాపు 80 కోట్ల గ్రాస్ దాటేసింది.
తాజాగా మూవీ యూనిట్ కూలీ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించింది. కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 151 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తమిళ్ సినిమాగా కూలీ నిలిచింది. గతంలో విజయ్ లియో సినిమా 148 కోట్లతో నిలవగా ఇప్పుడు ఆ రికార్డ్ కూలీ సినిమా బద్దలు కొట్టింది.
Also Read : Soubin Shahir : ‘సౌబిన్ షాహిర్’ కూలీ సినిమాలో రజినీకాంత్ నే డామినేట్ చేసిన నటుడు.. ఎవరితను?
ఇప్పటికే కూలీ సినిమా అమెరికాలో 3 మిలియన్ డాలర్స్ ని దాటేసింది. అంటే ఆల్మోస్ట్ 25 కోట్లకు పైగా గ్రాస్ అమెరికా నుంచే వచ్చింది. తెలుగులో కూడా దాదాపు 20 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. ఇక రజినీకాంత్ కెరీర్లో కూడా ఇదే ఎక్కువ కలెక్షన్స్, గతంలో రజిని కెరీర్ లో అత్యధికంగా జైలర్ 100 కోట్ల గ్రాస్, రోబో 2 80 కోట్ల గ్రాస్ వసూలు చేసాయి.
Also Read : Trivikram – Venkatesh : త్రివిక్రమ్ – వెంకీమామ సినిమా మొదలయింది.. ఇండిపెండెన్స్ డే స్పెషల్..