Soubin Shahir : ‘సౌబిన్ షాహిర్’ కూలీ సినిమాలో రజినీకాంత్ నే డామినేట్ చేసిన నటుడు.. ఎవరితను?
మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ బాగా వైరల్ అవుతున్నాడు.

Soubin Shahir
Soubin Shahir : నిన్న రజినీకాంత్ కూలీ సినిమా రిలీజయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్, సత్యరాజ్.. ఇలా చాలా మంది స్టార్స్, శృతి హాసన్, రుచిత రామ్, రెబా మోనికా.. హీరోయిన్స్ ఉన్నారు. ఇంతమంది స్టార్స్, హీరోయిన్స్ మధ్యలో మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ బాగా వైరల్ అవుతున్నాడు.
కూలీ సినిమా నుంచి పూజ హెగ్డే మోనికా సాంగ్ వచ్చినప్పుడే అందులో పూజాకు పోటీగా డ్యాన్స్ చేసి వైరల్ అయ్యాడు సౌబిన్ షాహిర్. అప్పుడే ఇతను ఎవరు అని అందరూ వెతకడం మొదలుపెట్టారు. తాజాగా కూలీ సినిమాకు అందరూ రజినీకాంత్ కోసమో, నాగార్జున కోసమో వెళ్లి సౌబిన్ షాహిర్ ఫ్యాన్స్ అయి తిరిగి వస్తున్నారు. కథ లో మెయిన్ పాత్ర సౌబిన్ షాహిర్ అంట. కథను ఇతనే నడిపిస్తాడట. రెండు వేరియేషన్స్ లో సౌబిన్ షాహిర్ అందర్నీ డామినేట్ చేసే విధంగా నటించాడని కూలీ సినిమా చూసిన ప్రేక్షకులు అంతా పొగిడేస్తున్నారు. దీంతో ఈ మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ఇప్పుడు వైరల్ గా మారాడు.
Also Read : Trivikram – Venkatesh : త్రివిక్రమ్ – వెంకీమామ సినిమా మొదలయింది.. ఇండిపెండెన్స్ డే స్పెషల్..
కేరళకు చెందిన సౌబిన్ షాహిర్ మలయాళ సినీ పరిశ్రమలోకి డైరెక్టర్ అవుదామని వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలు చేసాడు. ఈ గ్యాప్ లో నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేసాడు పలు సినిమాల్లో. సాయి పల్లవి మొదటి సినిమా ప్రేమమ్ లో పీటీ మాస్టర్ గా కనిపించి మెప్పించాడు. ఆ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అవ్వడంతో సౌబిన్ కి వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఆర్టిస్ట్ గా మలయాళం, తమిళ్ సినిమాల్లో నటిస్తూ వచ్చాడు.
మధ్యలో దర్శకుడిగా పరవ అనే సినిమా తీసి మెప్పించాడు. ఇటీవల మలయాళం నుంచి వచ్చి పెద్ద హిట్ అయిన మంజుమల్ బాయ్స్ సినిమాలో కీలక పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా ఆ సినిమాని తెరకెక్కించాడు. వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మలయాళంలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సమయంలో లోకేష్ కనగరాజ్ పిలిచి రజినీకాంత్ కూలీ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇంకేముంది దొరికిందే ఛాన్స్ అని తన నట విశ్వరూపం ఈ సినిమాలో చూపించాడు. దీంతో సౌబిన్ షాహిర్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ వైరల్ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత సౌబిన్ కి అన్ని భాషల్లో సినిమాలు వచ్చే అవకాశం ఉంది.
Also Read : JD Chakravarthy : డైరెక్టర్ చెప్పాడని ప్యాంట్ ఇప్పేసి.. హైదరాబాద్ రోడ్ల మీద పరిగెత్తిన నటుడు..