Fans War : ఫాన్స్ వార్ స్టార్ హీరోల కొంపముంచుతుందా?

టాలీవుడ్‌ హీరోల ఫ్యాన్స్ అభిమానానికి అంతు ఉండదు.

Fans War : ఫాన్స్ వార్ స్టార్ హీరోల కొంపముంచుతుందా?

Is Fans War Effects on Movies

Updated On : August 15, 2025 / 2:08 PM IST

టాలీవుడ్‌ హీరోల ఫ్యాన్స్ అభిమానానికి అంతు ఉండదు. హీరో కోసం కటౌట్‌ పెట్టి రిలీజ్ రోజే సినిమా చూడటం ఒక ఎత్తు అయితే.. మరో హీరోపై ద్వేషం పెంచుకోవడం ఈ మధ్య ఎక్కువైపోతోంది. ఏకంగా తమకు నచ్చని హీరోపై సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఫ్యాన్స్ పేరుతో కొందరు చేస్తున్న అతి హీరోలకు త‌ల‌నొప్పిగా మారుతోంది. తప్పుడు ప్రచారాలు చేస్తూ.. సినిమా చూడకపోయినా చూసినట్లు ఏం బాలేదంటూ రివ్యూలు పెడుతున్నారు.

పైగా మీమ్స్‌తో సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌కు తెరతీస్తున్నారు. పాజిటివిటీ కంటే నెగెటివిటీనే ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తుండటంతో స్టార్‌ హీరోలకు ఇరిటేటింగ్‌గా మారిందట. ఒక హీరో ఫ్యాన్స్‌ మరో హీరోపై ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోతున్నారట. ఒకప్పుడు థియేటర్ల దగ్గర గొడవలు పడే అభిమానులు..ఇప్పుడు నెట్టింట రచ్చరంబోల చేస్తున్నారు. మా హీరో గొప్ప అంటే..కాదు మా హీరో గ్రేట్ అంటూ ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. ఈ ఫ్యాన్‌ వార్‌ స్టార్ హీరోల కొంప ముంచుతోందట.

Soubin Shahir : ‘సౌబిన్ షాహిర్’ కూలీ సినిమాలో రజినీకాంత్ నే డామినేట్ చేసిన నటుడు.. ఎవరితను?

టాలీవుడ్‌లో స్టార్ వార్ ఎప్పుడో సీనియర్‌ ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు జూనీయర్ ఎన్టీఆర్ వరకు సీరియల్‌ ఎపిసోడ్‌ లాగే ఫ్యాన్ వార్ నడుస్తూనే ఉంది. అప్పుడు అంటే పాత కాలం ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. అభిమానం ఉంటే సినిమా చూసేవారు. లేకపోతే లైట్ తీసుకునే వారు. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్‌ రూపంలో ప్రపంచం అరచేతిలో ఉండిపోయింది. తమకు నచ్చని హీరో ఏం మాట్లాడినా..దాంట్లో కాంట్రవర్సీ వెతికీ మరీ క్షణాల్లో వైరల్ చేస్తున్నారు.

టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో సినిమా వచ్చిన మరో స్టార్ హీరో ఫ్యాన్స్..ఆ స్టార్ హీరో సినిమాను చూడకపోయిన సరే ట్రోల్స్‌ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారట. వాల్లే ఫ్లాప్‌ అని కన్ఫామ్ చేసేస్తున్నారు. అభిమానులే సినిమాలను కిల్ చేస్తున్నారని స్టార్ హీరోలు ఫీల్ అవుతున్నారట. ఫ్యాన్స్ అభిమానం తమ కొంపలు ముంచుతుందని వాపోతున్నారట.

అసలు సినిమా చూడని వాళ్లు కూడా చూసినట్టు నెగిటీవ్ రివ్యూలు పెట్టడంతో ఏం మాట్లాడాలో.. ఎవరిని ఏం అనాలో కూడా తెలియని పరిస్థితి ఉందట. ఇలా పనిగట్టుకుని నెగెటీవ్ ప్రపాగండ చేస్తే ప్యూచర్‌లో ఏ స్టార్ హీరో సినిమా కూడా అనుకున్న రిజల్ట్ సాధించడం కష్టమని ఆవేదన చెందుతున్నారట. ఈ ఫ్యాన్ వార్‌కు ఎంత తొందరగా చెక్ పెడితే అంత మంచిదని..అందుకోసం ఏదో సొల్యూషన్ వెతకాలని భావిస్తున్నారట.