Pawan Kalyan : జీతం తీసుకొని పనిచేద్దాం అనుకున్నాను.. కానీ ఇప్పుడు తీసుకోకూడదు అనుకుంటున్నాను..

తాజాగా పవన్ కళ్యాణ్ తన జీతంపై చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా తన మార్క్ పాలనని చూపిస్తున్నారు. అయితే ఎన్నికల్లో గెలిచాక కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ జనసేన ప్రతినిధులతో మాట్లాడుతూ.. నేను కూడా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా జీతం మొత్తం తీసుకుంటాను. ఎందుకంటే ప్రజల సొమ్ముని తింటున్నాను, ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోడానికి. నేను తీసుకునే జీతంలో ప్రతి రూపాయికి ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని అడగాలి. మనం పనిచేయకపోతే మా ట్యాక్స్ మనీతో శాలరీలు ఇస్తున్నాం, ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలు అడగాలి. అందుకు నేను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. ప్రజల డబ్బు శాలరీగా తీసుకుంటున్నాను అనే భయంతో నేను పనిచేస్తాను అని చెప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన జీతంపై చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

Also Read : Nag Ashwin : భార్య, వదినలతో దిగిన ఫోటో షేర్ చేసి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన కల్కి డైరెక్టర్..

పింఛన్ల పంపిణీ అనంతరం పవన్ మాట్లాడుతూ.. నేను తీసుకున్నవి చాలా కీలకమైన శాఖలు. నేను తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేద్దాం అనుకుంటున్నాను. పంచాయతీ శాఖలో ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. అసలు ఏ హెడ్ కింద ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా అర్ధం కావట్లేదు. ఒక్కో సెక్షన్ లో నాలుగేసి గంటలు కూర్చుంటే ఎన్నెన్ని కోట్లు పోయాయి తెలుస్తుంది. నా ఎకౌంట్స్ కి 20 సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక గంట సేపు కూడా కూర్చోలేదు. ప్రజల సొమ్ము కోసం ఎక్కడికి పోయాయో అని ఒక్కో సెక్షన్ లో నాలుగైదు గంటలు కూర్చున్నాను. ఒకప్పుడు నేను జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నాను కానీ ఈ నిధులు చూస్తే తీసుకోకూడదని అనుకుంటున్నాను. నాకు జీతం అవసరం లేదు నా దేశం కోసం, నా నేల కోసం నేను పని చేస్తాను అని అన్నారు. దీంతో తన శాఖల్లో తక్కువ నిధులు ఉన్నాయని జీతం తీసుకోకుండానే రాష్ట్రం కోసం పనిచేయడానికి పవన్ సిద్ధమయ్యారు. ఈ విషయంలో మరోసారి పవన్ ని అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు