Whatsapp Ads : వాట్సాప్‌‌లో త్వరలో స్టేటస్, ఛానల్స్‌లో యాడ్స్ చూడొచ్చు.. ఇందులో నిజమెంత?

Whatsapp Ads : వాట్సాప్ కొత్త వాయిస్ మెసేజ్, స్టిక్కర్ ఫీచర్‌లను టెస్టింగ్ చేస్తోంది. వాట్సాప్ స్టేటస్ ఫీచర్‌లో యాడ్స్ ప్రవేశపెట్టేందుకు పరిశీలిస్తోంది. ఇటీవలే వాట్సాప్ అధినేత విల్ క్యాత్‌కార్ట్‌తో ఇంటర్వ్యూలో ప్రస్తావించడంతో ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి.

Whatsapp Ads : ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్లాట్‌ఫారంలో స్టేటస్, ఛానల్‌ల సెక్షన్లలో యాడ్స్ తీసుకొచ్చేందుకు పరిశీలిస్తోంది. మెసేజింగ్ యాప్ కూడా అదే సమయంలో కొత్త వాయిస్ మెసేజ్, స్టిక్కర్ ఫీచర్‌లను డెవలప్ చేస్తోంది.

కంపెనీ మానిటైజేషన్ వ్యూహాలను విస్తరించడానికి, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచే దిశగా ప్రయత్నిస్తున్నట్టు నివేదికలు సూచిస్తున్నాయి.  ఇటీవలి ఇంటర్వ్యూలో, వాట్సాప్ సీఈఓ విల్ క్యాత్‌కార్ట్ స్టేటస్, ఛానల్‌లలో యాడ్స్ తీసుకువచ్చే అవకాశం ఉందని సూచించారు. మెయిన్ మెసేజ్ ఇన్‌బాక్స్‌ బదులుగా, ఈ రెండు కేటగిరీలలోనే యాడ్స్ కనిపించవచ్చునని హింట్ ఇచ్చారు.

Read Also : WhatsApp email Address : వాట్సాప్‌లో ఈ-మెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ ఆప్షన్.. ఆ యూజర్లకు మాత్రమే..!

అంతేకాదు.. ప్రధానంగా పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్, గ్రూపు చర్చలకు అంకితమైన ఛానల్‌లు సబ్‌స్క్రిప్షన్ ఆధారిత యాక్సెస్‌ను అందించవచ్చు లేదా ఛానల్ యజమానులు తమ కంటెంట్‌ను క్యాంపెయిన్ చేసేందుకు అనుమతించవచ్చు. అయితే, స్టేటస్ యాడ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించేలా ఉంటాయి. చాట్ ఇంటర్‌ఫేస్‌లో కాకుండా వాట్సాప్ గతంలో 2019లో స్టేటస్ ఫీచర్ బీటా వెర్షన్‌లో యాడ్స్ టెస్టింగ్ చేసింది. అయినప్పటికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు.

వాట్సాప్‌లో మరికొన్ని కొత్త ఫీచర్లు :

యాడ్స్ మాత్రమే కాదు.. వాట్సాప్ వాయిస్ మెసేజింగ్ స్టిక్కర్ల కోసం కొత్త ఫీచర్లను కూడా అభివృద్ధి చేస్తోంది. వాయిస్ రికార్డింగ్‌లను పాజ్ చేయడం, రీస్టార్ట్ చేయడం, అలాగే వాయిస్ మెసేజ్‌లకు స్టిక్కర్‌లను అందించే సామర్థ్యాన్ని అందించే ఫీచర్‌పై కంపెనీ పనిచేస్తోందని రిపోర్టు తెలిపింది. తద్వారా వాయిస్ మెసేజింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చగలవు. అయితే, స్టిక్కర్‌లు సంభాషణలకు వినోదాన్ని, క్రియేటివిటీని అందించగలవు.

WhatsApp Ads in Status and Channels

యాడ్స్ ద్వారా ఆదాయ మార్గాల కోసం అన్వేషణ :

యాడ్స్, కొత్త ఫీచర్‌ల అభివృద్ధి యూజర్-ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ కొనసాగిస్తూనే ఆదాయ మార్గాలను విస్తరించడానికి వాట్సాప్ కొనసాగుతున్న ప్రయత్నాలను సూచిస్తున్నాయి. యాడ్స్ అమలుపై కచ్చితమైన అధికారిక ప్రకటన లేనప్పటికీ కంపెనీ యూజర్లను ఇబ్బంది లేకుండా యాడ్స్ ద్వారా  ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. కొత్త వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా వాట్సాప్ మరిన్ని సరికొత్త ఫీచర్లను తీసుకురానుంది.  ఫీచర్ సెట్‌ను విస్తరించడం, కొత్త మోనటైజేషన్ మోడల్‌ ద్వారా మెసేజింగ్ ల్యాండ్‌స్కేప్‌లో పోటీగా ఉండాలనే లక్ష్యంతో వాట్సాప్ పనిచేస్తోంది.

మరోవైపు.. యాడ్స్ కారణంగా కంటెంట్ ప్లోకు అంతరాయం కలిగించవచ్చు. యూజర్ ఎంగేజ్‌మెంట్ తగ్గిపోవచ్చు. అంతేకాదు.. వాట్సాప్ బ్రాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు, యాడ్స్ ద్వారా కొత్త ఫీచర్ల అభివృద్ధికి నిధులను కూడా అందించే అవకాశం ఉంది. పర్సనలైజడ్ సిఫార్సులు లేదా తగ్గింపుల ద్వారా యూజర్ అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అంతిమంగా, స్టేటస్, ఛానల్‌లలో యాడ్స్ ప్రవేశపెట్టాలా వద్దా అనే నిర్ణయం వాట్సాప్‌పైనే ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు కంపెనీ యూజర్ల ప్రైవసీపరంగా కలిగే ఇబ్బందులు, నష్టాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Whatsapp Search Feature : వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్.. తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేయొచ్చు.. ఎలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు