WhatsApp email Address : వాట్సాప్‌లో ఈ-మెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ ఆప్షన్.. ఆ యూజర్లకు మాత్రమే..!

WhatsApp email Address : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మరో సరికొత్త ఇంటెస్ట్రింగ్ ఫీచర్ వస్తోంది. వాట్సాప్‌లో ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ ఆప్షన్ తీసుకొస్తోంది.

WhatsApp email Address : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ప్లాట్‌ఫారమ్‌లో అనేక ఫీచర్‌లను అందిస్తోంది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు మరో ఫీచర్‌ను యాడ్ చేసేందుకు రెడీగా ఉంది. ప్రధానంగా యాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. వాట్సాప్ ఇప్పటికే యూజర్ల కోసం సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు వినియోగదారులు వారి అకౌంట్ ధృవీకరించడానికి కొత్త మార్గాన్ని పరీక్షిస్తోంది. వాట్సాప్ అకౌంట్లో లాగిన్ చేయడానికి ఇమెయిల్ వెరిఫికేషన్ పద్ధతిని పరీక్షిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బీటా టెస్టింగ్‌లో ఉంది. రాబోయే నెలల్లో సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. SMS ద్వారా వన్-టైమ్ పాస్‌వర్డ్ అథెంటికేషన్ డిఫాల్ట్ మెథడ్‌ బదులుగా ఇమెయిల్ ఉపయోగించి అకౌంట్లలో లాగిన్ చేసే ఆప్షన్‌కు ప్రత్యామ్నాయమని గమనించాలి.

కొత్త ఫీచర్ ఇలా చెక్ చేయొచ్చు :

వాట్సాప్ త్వరలో ఇమెయిల్ ద్వారా మీ అకౌంట్ ధృవీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. యాప్ బీటా వెర్షన్‌లో మాత్రమే ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్‌కు సైన్ ఇన్ చేయడానికి అదనపు ఆప్షన్ అందిస్తోంది. ప్రస్తుతానికి, వాట్సాప్ యూజర్లు వారి ఫోన్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించి వారి అకౌంట్ ధృవీకరించడానికి అనుమతిస్తుంది.

Read Also : Whatsapp Video Controls : యూట్యూబ్‌లోనే కాదు భయ్యా.. వాట్సాప్‌లోనూ వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్స్..!

వాట్సాప్ బీటా ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేసిన యూజర్లు లేటెస్ట్ అప్‌డేట్ ద్వారా ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. వాట్సాప్ బీటా వెర్షన్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు యాప్ (Settings > Account > email Address) వెళ్లి కొత్త ఫీచర్ కోసం చెక్ చేయవచ్చు. మీరు ఆండ్రాయిడ్ 2.23.24.10 వెర్షన్, 2.23.24.8, 2.23.24.9 కోసం వాట్సాప్ బీటాను ఉపయోగిస్తున్నారా చెక్ చేసుకోండి. లేకుంటే.. మీరు (WABetaInfo) ప్రకారం.. యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుకోలేరు.

ఒకే యాప్‌లో రెండో వాట్సాప్ అకౌంట్ :

అంతేకాకుండా, వాట్సాప్ ఇటీవలే ఒక అకౌంట్లలో రెండు మొబైల్ నంబర్‌లను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఒక డివైజ్‌లో రెండు వేర్వేరు అకౌంట్లలో ఉపయోగించగలిగేలా యూజర్లు తమ ఫోన్‌లలో డ్యూయల్ లేదా క్లోన్ యాప్ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. విభిన్న ఫోన్ నంబర్‌లను ఉపయోగించే యూజర్లలో సులభంగా కనెక్ట్ అయ్యేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకోవచ్చు. అదే యాప్‌లో రెండో వాట్సాప్ అకౌంట్ సెటప్ చేసుకోవచ్చు. మీకు రెండో ఫోన్ నంబర్, SIM కార్డ్ లేదా మల్టీ-SIM లేదా eSIM టెక్నాలజీకి సపోర్టు ఇచ్చే డివైజ్ అవసరం ఉంటుంది.

WhatsApp email address verification option

బీటా టెస్టర్లకు మాత్రమే :
మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అధికారిక బ్లాగ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మీ ప్రతి అకౌంట్ సంబంధించిన ప్రైవసీ, నోటిఫికేషన్ సెట్టింగ్‌లపై మీకు పూర్తి కంట్రోల్ ఉంటుంది. కొన్ని వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. కానీ, ఇప్పటికీ చాలా మందికి ఫీచర్ అందలేదు. ఈ ఫీచర్ నవంబరులో ఎప్పుడైనా అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం, వాట్సాప్ బీటా టెస్టర్లు మాత్రమే ఈ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ మొదట వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌కు వస్తుంది. ఐఓఎస్ వెర్షన్ యూజర్ల కోసం కంపెనీ ఎప్పుడు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుందో ప్రస్తుతానికి తెలియదు.

Read Also : WhatsApp Login : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఫోన్ నెంబర్‌ లేకుండానే లాగిన్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు