boy 17, held for ‘killing’ Dalit girl resisting oral sex in UP, police say he tried to rape her after watching porn : టెక్నాలజీ పెరిగి, వాణిజ్య సంబంధాలు సులభతరం కావటం, తక్కువ ధరకే ఇంటర్నెంట్ లభించటంతో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ప్రజలు స్మార్ట్ ఫోన్ ను వారి వారి అవసరాల కోసం వినియోగిస్తున్నారు.
విజ్ఞానం కోసం కొందరు వ్యాపారంకోసం కొందరు కాలక్షేపానికి కొందరు ఇలా తమ అవసరాలకు తగ్గట్టువాడుతుంటారు. స్మార్ట్ ఫోన్లో పోర్నో వీడియోలు చూసిన యువకుడు మాటలు రాని మూగబాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ జిల్లా కివాల్ష గ్రామంలో జరిగింది.
ఫిబ్రవరి 28 ఆదివారం మధ్యాహ్నం ధౌరై గ్రామానికి చెందిన 17 వ్యవసాయ కూలీగా పని చేసే యువకుడు ఊళ్లో ఓ చెట్టుకింద తన స్మార్ట్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూసుకుంటూ కూర్చున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన ఒక మూగ యువతి అటువైపు వెళ్లటం చూశాడు.
అప్పటికే పోర్న్ వీడియోలు చూస్తున్న యువకుడు ఆమెను చూడగానే ఉద్రేకం చెందాడు. ఎలాగైనా ఆమెను అనుభవించాలనుకున్నాడు. ముగది కాబట్టి ఈ విషయం ఎవరికీ చెప్పదు అని భావించాడు. ఆమెను వెంబడించి వెళ్లి సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్లాడు. అక్కడ తన కోరిక తీర్చమని ఆమెను బలవంతం చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఆమె వేసుకున్న చున్నీతో మెడకు ఉరిబిగించి ఆమెను హత్య చేశాడు. అనంతరం శవాన్ని పక్కన ఉన్న మరోక పొలంలో పడేశాడు.
అమ్మాయి ఇంటికి రాకపోవటంతో వారి కుటుంబ సభ్యులు ఆమె కోసంగ్రామంలో వెతికారు. ఈ క్రమంలో వారికి మూగ బాలిక మృతదేహం పొలంలో కనిపించింది. ఈఘటనతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించగా గ్రామస్తులు పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులపై రాళ్లు రువ్వారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయని తెలుసుకున్నసీనియర్ పోలీసు అధికారులు అదనపు బలగాలను పంపి గ్రామస్తులను శాంతింప చేశారు. అనంతరం గ్రామస్తులు కేసు నమోదు చేసి బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలిచారు.
కేసు విచారణలో భాగంగా 8వ తరగతి తప్పిన 17 ఏళ్ల వ్యవసాయ కూలీని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై ఏపీసీలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమదు చేశారు. అతడి ఫోన్ తీసుకుని పరీక్షించగా అందులో 118 పోర్న్ వీడియో క్లిప్పులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని న్యాయమూర్తి ముందు హజరు పరచగా …జువైనల్ హోం కు తరలించారు.