Nellore Harass : నెల్లూరు జిల్లాలో దారుణం.. స్నేహితుడి భార్యపై అఘాయిత్యం.. వీడియోలు తీసి..

స్నేహితుడిని మద్యానికి బానిస చేసిన నీచుడు.. అతడి భార్యపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు అత్యాచారం వీడియోలు తీసి బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు.

Nellore Harass : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇలియాజ్ అనే వ్యక్తి బరితెగించాడు. స్నేహితుడిని మద్యానికి బానిస చేసిన ఇలియాజ్.. అతడి భార్యపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు అత్యాచారం వీడియోలు తీసిన ఇలియాజ్.. వాటిని బాధితురాలికి పంపి ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. చివరికి అతడి వేధింపులు భరించలేక భార్యాభర్తలిద్దరూ సెల్ఫీ వీడియోలు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Sexually Assaulted : బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడి

ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్న వారిని గుర్తించిన బంధువులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తమ చావుకి ఇలియాజ్ కారణం అంటూ సెల్ఫీ సూసైడ్ నోట్ లో బాధితులు పేర్కొనడం జరిగింది.

Lovers Suicide : పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని..రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

ట్రెండింగ్ వార్తలు