Babar Azam : బాబ‌ర్.. నువ్వు వ‌రుస‌గా మూడు సిక్స‌ర్లు కొడితే.. నా ఛాన‌ల్ మూసేస్తా : పాక్ కెప్టెన్‌కు స‌వాల్ విసిరిన అలీ

పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాంకు ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాడు బాసిత్ అలీ స‌వాల్ విసిరాడు.

Babar Azam – Basit Ali : పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాంకు ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాడు బాసిత్ అలీ స‌వాల్ విసిరాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2024లో అగ్ర‌శేణి జ‌ట్ల పై బాబ‌ర్ వ‌రుస‌గా మూడు సిక్స‌ర్లు కొట్టాల‌ని సూచించాడు. ఒక‌వేళ అత‌డు వ‌రుస సిక్స‌ర్లు కొడితే త‌న యూట్యూబ్ ఛానెల్ మూసి వేస్తాన‌ని చెప్పాడు. యూఎస్ఏ, ఐర్లాండ్ వంటి జ‌ట్ల‌పై మాత్రం కాద‌ని, అగ్ర‌శేణి జ‌ట్లు పై కొడితేనే తాను చెప్పింది చేస్తాన‌ని అన్నాడు. ఒక‌వేళ బాబ‌ర్ క‌నుక తాను చెప్పింది చేయ‌లేక‌పోతే ఓపెనింగ్ స్థానం నుంచి త‌ప్పుకోవాల‌నే కండిష‌న్ ను పెట్టాడు. ప్ర‌స్తుతం అలీ విసిరిన స‌వాల్ సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాబ‌ర్ ఈ స‌వాల్‌ను స్వీక‌రించాల‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈ నేప‌థ్యంలో కెప్టెన్సీకి బాబ‌ర్ ఆజాం రాజీనామా చేశాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టెస్టుల‌కు షాన్ మ‌సూద్‌ను, టీ20ల‌కు షాహీన్ షా అఫ్రీదిని కెప్టెన్లుగా నియ‌మించింది. అయితే.. షాహీన్ అఫ్రిది సార‌థ్యంలో ఒకే సిరీస్‌లో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దీంతో ప్ర‌పంచ‌క‌ప్‌కు కొన్ని రోజుల ముంగిట అత‌డిని కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి తిరిగి బాబ‌ర్ ఆజాంకు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది పీసీబీ.

SRH vs LSG : కాస్త క‌రుణించు వ‌రుణ‌దేవా.. మ్యాచ్ ర‌ద్దైతే స‌న్‌రైజ‌ర్స్ ప‌రిస్థితేంటంటే?

భార‌త కాల‌మానం జూన్ 2 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానుంది. పాకిస్తాన్ త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 6న అమెరికాతో ఆడ‌నుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసే భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జూన్ 9న జ‌ర‌గ‌నుంది. కాగా.. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ కోసం ఇటీవ‌ల పాకిస్తాన్ టీమ్ త‌న కొత్త జెర్సీతో పాటు థీమ్ సాంగ్‌ను విడుద‌ల చేసింది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు పాకిస్తాన్ జ‌ట్టు ఇదే..

బాబ‌ర్ ఆజాం (కెప్టెన్), మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (వికెట్ కీప‌ర్), స‌యీం అయూబ్, ఇర్ఫాన్ ఖాన్, అజం ఖాన్ (వికెట్ కీప‌ర్), ఉస్మాన్ ఖాన్, ఫ‌ఖ‌ర్ జ‌మాన్, ఇఫ్తికార్ అహ్మ‌ద్, షాదాబ్ ఖాన్, ఇమ‌ద్ వ‌సీం, అఘా స‌ల్మాన్, హ‌స‌న్ అలీ, న‌సీం షా, మ‌హమ్మ‌ద్ అమిర్, షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మ‌ద్, అబ్బాస్ అఫ్రిది.

IPL 2024 PlayOffs : ర‌స‌వ‌త్త‌రంగా మారిన ప్లే ఆఫ్స్ స‌మ‌రం.. ముంబై మిన‌హా మిగిలిన అన్ని జ‌ట్ల‌కు అవ‌కాశం..!

ట్రెండింగ్ వార్తలు