Weak HandShake : మీరు వీక్‌గా హ్యాండ్ షేక్ ఇస్తున్నారంటే… దానర్ధం టైప్ 2 డయాబెటీస్ రావచ్చు…

  • Publish Date - September 6, 2020 / 09:27 PM IST

Weak handshake Sign Of Type 2 Diabetes : భవిష్యత్తులో మీకు టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందో లేదో ఎలాంటి  టెస్టు లేకుండా చెప్పేయొచ్చు.. అదేలాగా అంటారా? జెస్ట్ మీరు షేక్ హ్యాండ్ ఇస్తే చాలు.. మీకు డయాబెటిస్ ముప్పు ఉందో తెలిసిపోతుంది.. హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు మీ హ్యాండ్ గ్రిప్ బట్టే వెంటనే తెలిసిపోతుంది..



ఒకవేళ మీ హ్యాండ్ గ్రిప్ వీక్ గా ఉంటే మాత్రం మీకు భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని అర్థం చేసుకోవచ్చు.. ఇదొక్కటి చాలు.. టైప్-2 డయాబెటిస్ వస్తుందని హెచ్చరిస్తోంది ఓ అధ్యయనం.. బ్రిస్టల్, ఫిన్లాండ్ సైంటిస్టులు 20ఏళ్లలో 776 మందిని పరీక్షించారు.

వీరిలో టైప్ 2 డయాబెటిస్ ముప్పు ఉందని వారి హ్యాండ్ గ్రిప్ ద్వారా నిర్ధారించామని కనుగొన్నారు.. కొందరు రోగులను ఐసోమెట్రిక్ ద్వారా డైనమోమీటర్ హ్యాండిల్ ను పట్టుకుని గట్టిగా నొక్కాలని కోరారు. ఇలా ఐదు సెకన్ల పాటు చేయాలని సూచించారు.



ప్రముఖ రచయిత డాక్టర్ Setor Kunutsor ప్రకారం.. హ్యాండ్‌గ్రిప్ ద్వారా తెలుసుకోవడం చాలా సింపుల్ అంటున్నారు.. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించవచ్చునని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు డయాబెటిస్ తొమ్మిదవ కారణమన్నారు.

UKలో మాత్రమే, 40 కంటే ఎక్కువ పది మందిలో ఒకరు టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారని వెల్లడించారు. కండరాల వీక్ నెస్ కారణంగా గుండెజబ్బులు, ఇతర అవయవాల వైఫల్యం.. వైకల్యం క్రమంగా మరణానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.



టైప్-2 డయాబెటిస్ అంటే ఏమిటి? :
టైప్ 2 డయాబెటిస్ అంటే.. డయాబెటిస్ యూకే ప్రకారం.. అన్ని కేసులలో 85శాతం, 95 శాతం మధ్య ఉంటుంది. శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే.. ఈ డయాబెటిస్ వస్తుంది.. ఇన్సులిన్ సరిగా పనిచేయనప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. సాధారణంగా 40 ఏళ్ల వయస్సు నుండి టైప్ 2 డయాబెటిస్ బారిన బాధపడుతున్నారు.



ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాలతో పాటు మంచి జీవన శైలితో ఈ డయాబెటిస్ మహమ్మారి నుంచి బయటపడొచ్చు అంటోంది ఈ అధ్యయనం.. దక్షిణ ఆసియాలో ఈ వ్యాధి 25ఏళ్లకే కనిపిస్తోంది. పిల్లలలో, అందరి యువకులలో టైప్ 2 డయాబెటిస్ పెరిగిపోతోంది. ఊబకాయం కూడా ఈ వ్యాధికి కారణమని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు