WHO: ప్రపంచంలో కరోనా మరణాలు.. నలుగురిలో ఒకరు భారత్ నుంచే!

కరోనా వైరస్ కరాళ నృత్యానికి భారత్ చిగురుటాకులా వణికిపోతోంది. ప్రపంచంలో ఎక్కువ కేసులు భారత్ నుంచే వస్తుండగా.. వేల సంఖ్యలో ప్రతిరోజూ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, గత వారం 5.7మిలియన్ల కొత్త కేసులు నమోదవగా.. 93,000 మంది చనిపోయినట్లుగా WHO ప్రకటించింది.

అందులో భారతదేశం దాదాపు 2.6 మిలియన్ల కొత్త కేసులను, మునుపటి వారంలో 20% పెరుగుదలతో 23,231 మరణాలను నివేదించింది. అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే ఈ లెక్క ఉందని, కానీ, వాస్తవానికి కరోనా కేసులు ఇంకా ఎక్కువ నమోదై ఉండవచ్చునని, పెద్ద సంఖ్యలో మరణాలు ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజమైన లెక్కలతో నిష్పత్తి మరింత ఎక్కువ ఉంటుదని అంటున్నారు.

ప్రపంచ జనాభాలో దాదాపు 18% భారతదేశం జనాభాకి కోవిడ్ సోకినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. భారతదేశంలో వ్యాప్తి పొరుగు దేశాలకి కూడా వ్యాపించినట్లుగా సంకేతాలు ఉన్నాయి. గతవారం నేపాల్ కేసుల్లో 137% పెరిగి 31,088కు చేరుకోగా, శ్రీలంకలో కోవిడ్ -19 వ్యాప్తి పెరుగుతోందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

అమెరికా తరువాత 20 మిలియన్ల కరోనా వైరస్ కేసులు నమోదైన రెండవ దేశంగా భారత్ నిలిచింది. గత 24 గంటల్లో భారతదేశ కరోనావైరస్ మరణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశంలో 3,780 కొత్త కేసులు సంభవించాయి. రోజువారీ కరోనా కేసులు 382,315

గతవారం ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం భారత్‌లోనే నమోదైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచంలో కరోనా కారణంగా నలుగురిలో ఒకరు భారత్‌ నుంచే చనిపోతున్నట్లుగా డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

ఆసియా దేశాల్లో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 90శాతం భారత్‌ నుంచే. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వాటిలో ఇది 46శాతం. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం, భారత్‌లో కొవిడ్‌ కేసుల సంఖ్య 2కోట్లు దాటగా, మరణాల సంఖ్య 2లక్షల 26వేలు దాటింది.

ట్రెండింగ్ వార్తలు