ఆవు పేడ చిప్స్‌.. మీ ఫోన్లలో 60శాతం రేడియేషన్ తగ్గించగలవు : టెస్టులో తేలింది.. సైంటిఫిక్ ఆధారాలివే

cow dung chips ‘reduce’ caesium radioactivity : ఆవు పేడ, గోమూత్రంతో ఆరోగ్యపరంగా మానవాళికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. అలాగే సీసియం రేడియోధార్మికతను కూడా తగ్గించగలదని టెస్టులో తేలింది. ప్రభుత్వ గోవు ఏజెన్సీ.. ఆవు పేడతో చేసిన చిప్స్ ఎంతవరకు రేడియేషన్ అడ్డుకోగలవో పరీక్షించారు. అందులో ఆవు పేడ చిప్స్.. 60 శాతం రేడియేషన్ తగ్గించగలవని రుజువైంది.

కొన్ని నెలల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆవుపేడతో రూపొందించిన చిప్ ఆవిష్కరించింది. దీనికి ‘గౌసత్వా కవచ్’అనే పేరు కూడా పెట్టారు. మీ మొబైల్ ఫోనుల్లో ఆవుపేడతో చేసిన చిప్‌ను వాడాలంటూ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. రేడియేషన్ సమస్యే ఉండదని, రేడియేషన్ మీవద్దకు రాకుండా ఆవుపేడతో చేసిన చిప్ మిమ్మల్ని కాపాడుతుందని అంటూ రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చీఫ్ (RKA)వల్లభాయ్ కతిరియా ఇదివరకే ప్రజలకు సూచించారు.

ఇప్పుడు ఆవు పేడ చిప్స్ రేడియేషన్ కచ్చితంగా తగ్గించగలదని సైంటిఫిక్ ఆధారాలతో రుజువైంది. తాజా టెస్టు రిపోర్టులో.. ఆవుపేడ చిప్స్ 60 శాతం రేడియేషన్ తగ్గించగలవు. మందంగా ఉండే వేర్వేరు ఆవు పేడ చిప్స్ శాంపిల్స్ Geiger Muller (GM) కౌంటర్ అనే పరికరం ద్వారా పరీక్షించారు. ఈ పరికరంలో (Nucleonix GM Counting system GC601A) ద్వారా ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగానికి రేడియోధార్మిక మూలం వోల్టేజ్ 450V స్థిరాంకం వద్ద సీసియం (Cs137)ను ఉపయోగించారు.

ఈ పరికరం రేడియేషన్ ఎంత ఉందో గుర్తించి ఏ స్థాయిలో ఉందో నిర్ధారిస్తుంది. మందం కలిగిన ఆవు పేడ శాంపిల్స్ డిటెక్టర్ మధ్య ఒక్కొక్కటిగా ఉంచారు. డిటెక్టర్లలో తేడాలను గుర్తించారు. ఆవు పేడ మందాన్ని బట్టి 100 సెకన్లకు లెక్కించారు.. అలా 325, 361 పరిధిలో ఉన్నాయని లెక్కించినట్టు నివేదిక తెలిపింది. ఆవు పేడ చిప్ లేకుండా రేడియేషన్ 100 సెకన్లకు 798గా ఉందని నిర్ధారించారు.

ట్రెండింగ్ వార్తలు