Low Risk COVID Patients : ఆస్పత్రిలో లేని కరోనా బాధితుల్లో తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్యం ముప్పు తక్కువ

కరోనావైరస్ బాధితుల్లో చాలామందిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా వారిలో కొన్ని కరోనా లక్షణాలు దీర్ఘకాలం వెంటాడుతున్నాయి. అందులో తీవ్రమైన అనారోగ్య సమస్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Non-hospitalised COVID patients : కరోనావైరస్ బాధితుల్లో చాలామందిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా వారిలో కొన్ని కరోనా లక్షణాలు దీర్ఘకాలం వెంటాడుతున్నాయి. అందులో తీవ్రమైన అనారోగ్య సమస్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని కోలుకున్నవారిలోనే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆస్పత్రిలో చేరినవారితో పోలిస్తే.. ఆస్పత్రిలో చేరని కరోనా బాధితులు వైరస్ నుంచి కోలుకున్నాక వారిలో తీవ్రమైన అనారోగ్య సమస్యల ముప్పు చాలా తక్కువగా ఉన్నట్టు ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. SARS-Cov-2 అనే వైరస్ కొవిడ్-19 వ్యాధిని వ్యాప్తిచేస్తూ తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. వైరస్ సోకిన సమయంలో కంటే కోలుకున్నాక కూడా వైరస్ ప్రభావ లక్షణాలు దీర్ఘకాలం బాధిస్తున్నాయని గుర్తించారు. కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రిల్లో చేరాల్సిన అవసరం లేదని.. వారంతా ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటూ కరోనా చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

దీనిద్వారా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అవసరమైన బాధితులకు బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాన్ని అందించేందుకు వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు. అత్యవసరాల్లో తప్ప ఆస్పత్రిల్లో చేరాల్సిన అవసరం లేదని, ఇంటివద్దనే వైద్యసాయం తీసుకోవడమే ఉత్తమమని అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఊపిరితిత్తుల్లో సమస్యలు, ఇతరేతర అనారోగ్య సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

కరోనావైరస్ శ్వాసపరమైన సమస్యకు కారణమవుతుంది.. వైరస్ ప్రభావం శ్వాసనాళాలపై అధికంగా ఉంటుంది.. అందుకే ఊపిరితిత్తులు దెబ్బతినే ముప్పు ఎక్కువగా ఉంటుంది.. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేని స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్న కరోనా బాధితుల్లో దీర్ఘకాలిక తీవ్ర అనారోగ్య సమస్యల ముప్పు చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనం వివరించింది.

ట్రెండింగ్ వార్తలు