చిరు సర్‌ప్రైజ్.. దివాళీ వేడుకల్లో దేవరకొండ, మహేష్ ఫ్యామిలీస్..

  • Publish Date - November 16, 2020 / 12:49 PM IST

Chiranjeevi – Ram Charan : దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. మెగాభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. చిరు, రామ్ చరణ్ తీసుకున్న సెల్ఫీను షేర్ చేశారు చిరంజీవి. తండ్రీ కొడుకులు సెల్ఫీ తీసుకుంటుండగా బ్యాగ్రౌండ్‌లో తారాజువ్వలు ఆకాశంలో మెరవడం చూస్తుంటే ఈ ఫొటో చూడడానికి మెగాభిమానులకు రెండు కళ్ళు చాలవంటే నమ్మాలి మరి.

దేవరకొండ ఫ్యామిలీ దివాళీ
దీపావళి పండుగని చక్కగా ఫ్యామిలీతో జరుపుకున్నట్లుగా తెలుపుతూ.. ఓ ఫొటోని షేర్ చేశాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. విజయ్ షేర్ చేసిన ఈ ఫొటోలో.. తల్లిదండ్రులు, తమ్ముడితో పాటు.. పెట్ డాగ్ కూడా ఉంది. ఈ ఫొటో చూసిన విజయ్ అభిమానులు, నెటిజన్లు క్యూట్‌ ఫ్యామిలీ అంటూ కామెంట్ చేస్తున్నారు.



https://10tv.in/rrr-team-accepted-ram-charans-challenge-and-planted-saplings/
ఇట్స్ డిన్నర్ టైమ్
సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు. ఈ దీపావళిని నమ్రత, సితార, గౌతమ్‌లతో పాటు నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కుటుంబంతో కలిసి అక్కడే జరుపుకున్నారు. తాజాగా సితార పాప పిక్స్ షేర్ చేసింది నమ్రత. అలాగే నో మాస్క్స్ అంటూ లాస్ట్ నైట్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి డిన్నర్ టైంలో తీసుకున్న ఫొటో కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నమ్రత.

ట్రెండింగ్ వార్తలు