Punjab Kings Interesting Reply to Sun Risers Hyderabad Tweet with Mahesh Babu Photo
Punjab Kings : ఈసారి ఐపీఎల్ 2024 సీజన్ భారీ పరుగులతో ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. నిన్న శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోల్‌కతా 262 పరుగులు చేయగా పంజాబ్ జట్టు దాన్ని కేవలం 18.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతా కోల్‌కతా గెలుస్తుంది అనుకుంటే ఊహించని విధంగా పంజాబ్ గెలిచింది.
దీంతో పంజాబ్ జట్టుకి అభినందనలు వెల్లువెత్తాయి. వేరే ఐపీఎల్ జట్లు కూడా పంజాబ్ టీంకి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నాయి. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా టీం.. గేమ్ అదిరిపోయింది. ఈడెన్ గార్డెన్స్ లో రన్స్ వరద పారింది అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి పంజాబ్ రిప్లై ఇస్తూ మహేష్ బాబు అభిమానులకు దండం పెడుతున్న ఫోటోని షేర్ చేసి.. ప్రేమ ఫ్రమ్ పంజాబ్ అని ట్వీట్ చేసింది.
పంజాబ్ టీం తెలుగులో ప్రేమ అని రాసి మహేష్ బాబు ఫొటోతో ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మహేష్ అభిమానులు ఈ ట్వీట్ ని మరింత షేర్ చేస్తున్నారు.
ప్రేమ from Punjab ❤️ https://t.co/kFjrUGPGsu pic.twitter.com/8WzLYtqbmL
— Punjab Kings (@PunjabKingsIPL) April 26, 2024