×
Ad

Sri Sarathi Studios : డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలు ప్రారంభించిన శ్రీ సారథీ స్టూడియోస్.. కల్కితో మొదలు..

తాజాగా శ్రీ సారథీ స్టూడియోస్ లో తెలుగు రాష్ట్రాలలోనే సరికొత్త టెక్నాలజీతో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను ప్రారంభించారు.

  • Published On : April 27, 2024 / 11:48 AM IST

Sri Sarathi Studios started New Technology Sound Designing Studio

Sri Sarathi Studios : హైదరాబాద్ అమీర్ పెట్ లో ఉన్న శ్రీ సారథీ స్టూడియోస్ అందరికి పరిచయమే. ఎన్నో ఏళ్ళ నుంచి సిటీ మధ్యలో ఉండి సినిమా వాళ్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఎన్నో సినిమాలు, టీవీ షోలు, సీరియల్స్.. రోజూ ఇక్కడే షూట్ జరుపుకుంటాయి. ఇటీవల ఈ స్టూడియోని బాగా అభివృద్ధి చేస్తున్నారు.

తాజాగా శ్రీ సారథీ స్టూడియోస్ లో తెలుగు రాష్ట్రాలలోనే సరికొత్త టెక్నాలజీతో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను ప్రారంభించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాల్బీ మిక్సింగ్ స్టూడియోను ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి ప్రారంభించగా, సౌండ్ డిజైన్ స్టూడియోను సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంబించారు.

Also Read : Kurchi Madathapetti Song : ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ విని పొట్టలో బేబీ తంతున్నాడు.. వైరల్ అవుతున్న ప్రగ్నెంట్ వుమెన్ కామెంట్..

ఈ కార్యక్రమంలో శ్రీ సారథీ స్టూడియోస్ చైర్మన్ MSRV ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో ఈ స్టూడియోని మల్టీఫ్లెక్స్ థియేటర్స్ గా మార్చాలనుకున్నాం. కానీ ఆ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నాం. సినిమా షూటింగ్స్ కి స్టూడియోస్ గానే కొనసాగించాలని ఫిక్స్ అయి దానికి తగ్గట్టు డెవలప్ చేశాము. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్స్ కు సపోర్ట్ ఇవ్వడానికి కొత్త టెక్నాలజీని స్టూడియోలో ప్రారంభించాము. ఇప్పుడు ప్రారంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలు చాలా కొత్త టెక్నాలజీకి చెందినవి. ఈ టెక్నాలజీతో మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా ప్రభాస్ ‘కల్కి’ అని తెలిపారు.