Vishwak Sen Neha Shetty Gangs of Godavari Teaser Released
Gangs of Godavari Teaser : విశ్వక్ సేన్(Vishwak Sen), నేహశెట్టి (Neha Shetty) జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో అంజలి (Anjali) ముఖ్య పాత్రలో కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా గత సంవత్సరమే రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల గామి తో మంచి హిట్ కొట్టిన విశ్వక్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో రాబోతున్నాడు.
ఆల్రెడీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి గ్లింప్స్, రెండు సాంగ్స్ కూడా వచ్చి వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఫుల్ యాక్షన్ మోడ్ తో ఉంది. ఒక్కసారి లంకలో కత్తి కట్టారంటే ఆ మనిషిని సంపకుండా వదలరు.. అనే డైలాగ్ తో మొదలైంది టీజర్. ఊరంతా విశ్వక్ ని చంపడానికి చూస్తున్నట్టు, విశ్వక్ దాన్ని ఎదుర్కొన్నట్టు చూపించారు. అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కోడికి శివాలెత్తిపోద్దంతే.. అనే పవర్ ఫుల్ డైలాగ్ తో విశ్వక్ యాక్షన్ ఫీస్ట్ చూపించారు. మీరు కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ చూసేయండి.
ఈ టీజర్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మే 17న రాబోతున్నాడు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా అదిరిపోయే సంగీతం ఇచ్చాడని టీజర్ చూస్తుంటేనే అర్ధమవుతుంది.