Site icon 10TV Telugu

C.D(Criminal Or Devil) Trailer : నన్ను చంపడానికి వచ్చింది ఎవరు.. అదా శర్మ ‘క్రిమనల్ or డెవిల్’ ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయిన అదా శర్మ ఫైట్స్..

Adah Sharma Criminal Or Devil Trailer Released

Adah Sharma Criminal Or Devil Trailer Released

C.D(Criminal Or Devil) Trailer : అదా శర్మ(Adah Sharma) ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతుంది. తాజాగా తెలుగులో అదా శర్మ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ అన్నం దర్శకత్వంలో అదా శర్మ మెయిన్ లీడ్ లో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, మహేష్ విట్టా.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కుతున్న సినిమా ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’.

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ సినిమా ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. ఇక ట్రైలర్.. చీకటి, వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు.. అనే డైలాగ్ తో ఆసక్తిగా మొదలయి విశ్వంత్.. తన ఇంట్లో దయ్యం ఉందా? తనని చంపడానికి వచ్చింది దయ్యమా? క్రిమినలా? అనే ఆలోచనలతో ఆసక్తిగా సాగింది. ట్రైలర్ లో అదా శర్మ యాక్షన్స్ అదరగొట్టేసింది. సినిమాలో అదా శర్మకి భారీగానే ఫైట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మీరు కూడా ఈ యాక్షన్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్.. ఇన్ని జానర్స్ ఉన్న ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ సినిమా ట్రైలర్ చూసేయండి.

Also Read : Ramayanam : సైలెంట్‌గా రామాయణం మొదలుపెట్టేసిన బాలీవుడ్.. షూటింగ్ నుంచి రణబీర్, సాయి పల్లవి ఫొటోస్ లీక్..

ఇక ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ సినిమా ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. మే 10న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version