Dhurandhar 2: పోటీ నుంచి టాక్సిక్ అవుట్.. సింగల్ గా వస్తున్న దురంధర్.. ఇక రికార్డుల మోత కన్ఫర్మ్
టాక్సిక్ వాయిదాతో లైన్ క్లియర్ చేస్తున్న ధురంధర్ 2(Dhurandhar 2) మూవీ.
Toxic movie dropped out of competition with Dhurandhar 2
- యష్ టాక్సిక్ సినిమా వాయిదా
- దురంధర్ 2 సినిమాకు లైన్ క్లియర్
- భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటూనే ట్రేడ్ వర్గాలు
Dhurandhar 2; ఒకటి పాన్ ఇండియా హీరో సినిమా.. ఒకటి సింగల్ లాంగ్వేజ్ లో రిలీజై ఏకంగా రూ.1400 కోట్లు కొల్లగొట్టిన సినిమాకు సీక్వెల్. ఈ రెండు సినిమాలు ఒకేరోజు వస్తే ఆ బాక్సాఫీస్ వార్ ఎలా ఉంటుందో చెప్పడం అంత తేలిక కాదు. జస్ట్ పేస్ చేయాలి అంతే. ఆ రెండు సినిమాలు మరేవో కాదు ఒకటి టాక్సిక్, మరొకటి దురంధర్. అవును, ఈ రెండు భారీ సినిమాలు మార్చి 19న వస్తున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
దాంతో, మార్చి 19న భారీ బాక్సాఫీస్ వార్ కన్ఫర్మ్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, అనూహ్యంగా ఈ పోటీ నుంచి కన్నడ స్టార్ యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ సినిమా వాయిదా పడింది. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా టాక్సిక్ సినిమాను జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ నోట్ విడుదల చేశారు. దీంతో, దురంధర్ 2 సినిమాకు లైన్ క్లియర్ అయింది అని చెప్పాలి.
Toxic: యష్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. టాక్సిక్ సినిమా వాయిదా
నిజానికి, దురంధర్ భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో దురంధర్ 2(Dhurandhar 2)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, దురంధర్ సినిమా ఒకే భాషలో విడుదల అవగా ఇప్పుడు దురంధర్ 2 సినిమాను ఏకంగా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్. దీంతో, ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నెలకొన్న అంచనాల కారణంగా ఓపెనింగ్స్ కూడా రికార్డ్ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది.
మొదటి పార్ట్ రూ.1400 కోట్లు కొల్లగొట్టిన నేపధ్యంలో దురంధర్ 2 సినిమా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలా అయితేనేం ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా దురంధర్ 2 సినిమాకు బాగా కలిసొచ్చేలా ఉంది. మరి, దురంధర్ 2 సినిమాను మేకర్స్ మార్చి 19న విడుదల చేస్తారా లేదా యుద్ధం కారణంగా వాయిదా వేస్తారా అనేది చూడాలి.
