Kurchi Madathapetti Song : ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ విని పొట్టలో బేబీ తంతున్నాడు.. వైరల్ అవుతున్న ప్రగ్నెంట్ వుమెన్ కామెంట్..

యూట్యూబ్ లో కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ కింద కామెంట్స్ లో ఓ ప్రగ్నెంట్ వుమెన్ పెట్టిన కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

Kurchi Madathapetti Song : మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన కుర్చీ మడతపెట్టి సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో తెలిసిందే. సినిమా రిలీజ్ కి ముందే ఈ పాట సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసింది. ఇక సినిమా రిలీజయ్యాక మహేష్, శ్రీలీల(Sreeleela) స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లాయి. కుర్చీ మడతపెట్టి సాంగ్ బయట కూడా బాగా వైరల్ అవుతుంది. ఈ మధ్య ఇంటర్నేషనల్ స్టేజీలపై కూడా వినిపిస్తుంది.

ఇటీవల యూట్యూబ్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఏకంగా 200 మిలియన్స్ వ్యూస్ సాధించి మరోసారి వైరల్ అయింది. ఈ క్రమంలో యూట్యూబ్ లో కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ కింద కామెంట్స్ లో ఓ ప్రగ్నెంట్ వుమెన్ పెట్టిన కామెంట్ బాగా వైరల్ అవుతుంది. అన్విత జోబి అనే అకౌంట్ నుంచి కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ కింద కామెంట్స్ లో.. నేను ఇప్పుడు ఆరు నెలల ప్రగ్నెంట్, ఈ పాట ప్లే అయిన ప్రతి సారి కడుపులో బిడ్డ పొట్టని తంతున్నాడు అని కామెంట్ చేసింది ఓ నెటిజన్.

Also Read : Avasarala Srinivas : RRR సినిమా చూస్తుంటే ఆ బాలీవుడ్ సినిమా గుర్తొచ్చింది.. అందులో కూడా ఇద్దరు హీరోలు..

దీంతో ఈ ప్రగ్నెంట్ వుమెన్ కామెంట్ వైరల్ గా మారింది. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆరు నెలలకే లోపల బేబీ తంతున్నాడా? ఊరికే ఇలా కామెంట్ పెట్టిందేమో, అయితే పెద్దయ్యాక ఆ బేబీ డాన్సర్ అవుతాడేమో, థమన్ కడుపులో పిల్లల్ని కూడా తన మ్యూజిక్ తో కదిలిస్తున్నాడు, త్వరలో క్యూట్ మహేష్ బాబు వస్తాడు.. అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్ తో పలువురు మీమ్స్ వేసి మరింత వైరల్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు