Avasarala Srinivas : RRR సినిమా చూస్తుంటే ఆ బాలీవుడ్ సినిమా గుర్తొచ్చింది.. అందులో కూడా ఇద్దరు హీరోలు..
తాజాగా నటుడు అవసరాల శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

Avasarala Srinivas Compared RRR Movie with Bollywood Biggest Blockbuster Movie
Avasarala Srinivas : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్స్ లో చాలా మంది స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన RRR సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. RRR తో పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ గుర్తింపు తీసుకొచ్చారు రాజమౌళి. ఏకంగా RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఇక RRR సినిమాపై అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు, ప్రేక్షకులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు.
తాజాగా నటుడు అవసరాల శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు RRR సినిమా చూస్తుంటే బాలీవుడ్ సినిమా షోలే గుర్తొచ్చింది. అందులో కూడా ఇద్దరు హీరోలు జై, వీరు పాత్రలు కలిసి పోరాడతారు అని అన్నారు. అయితే షోలేలో జై, వీరు పాత్రల్లో అమితాబ్ ధర్మేంద్ర విలన్ ని చంపడానికి ప్రయత్నిస్తే.. ఇక్కడ RRR లో భీమ్, రామ్ పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ బ్రిటిష్ వాళ్ళని అంతం చేయడానికి ప్రయత్నిస్తారు. షోలేలో జై పాత్ర మరణిస్తుంది.
Also Read : Mrunal Thakur : ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని గుర్తుచేసుకొని చెంపదెబ్బ కొట్టమన్న హీరో.. మృణాల్ ఏం చేసిందో తెలుసా?
ఇలా ఇద్దరు హీరోలు కలిసి ఒకర్ని అంతం చేయడానికి ప్రయత్నించే కథలా ఉండటంతో అవసరాల శ్రీనివాస్ కి RRR చూస్తుంటే షోలే గుర్తొచ్చింది అని అన్నారేమో. ఇక షోలే సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని తెలిసిందే. శ్రీనివాస్ RRR సినిమాని షోలేతో కంపేర్ చేయడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.