Mrunal Thakur : ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని గుర్తుచేసుకొని చెంపదెబ్బ కొట్టమన్న హీరో.. మృణాల్ ఏం చేసిందో తెలుసా?
షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా హిందీ జెర్సీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ హీరోని చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంటుంది.

Mrunal Thakur says Interesting Thing with Shahid Kapoor while Jersey Shooting
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. వరుస విజయాలతో, వరుస అవకాశాలతో బిజీగా ఉంది మృణాల్. మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ జెర్సీ(Jeresy) సినిమా షూటింగ్ సమయంలో షాహిద్ కపూర్ తో జరిగిన ఓ ఆసక్తికర ఘటన గురించి పంచుకుంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా తెలుగులో వచ్చిన జెర్సీ సినిమా మంచి విజయం సాధించి నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. ఈ సినిమాని హిందీలో అదే పేరుతో, అదే దర్శకుడితో రీమేక్ చేసారు. షాహిద్ కపూర్(Shahid Kapoor), మృణాల్ ఠాకూర్ జంటగా హిందీ జెర్సీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ హీరోని చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంటుంది. మృణాల్ షాహిద్ కపూర్ ని గట్టిగా చెంపదెబ్బ కొట్టాలి. తాజాగా ఇంటర్వ్యూలో ఈ సీన్ షూటింగ్ చేసేటప్పుడు జరిగిన సంఘటన తెలిపింది.
Also Read : Kalki 2898AD : కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్..? స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయ్యే టైంకి.. వర్కౌట్ అవుద్దా?
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. జెర్సీ సినిమాలో షాహిద్ కపూర్ ని చెంపదెబ్బ కొట్టాలి. నాకు ఆయనంటే ఎప్పట్నుంచో అభిమానం, ఆయనతో కలిసి వర్క్ చేయాలనుకున్నా. ఆయన్ని కొట్టమనేసరికి కొట్టలేకపోయాను. చిన్నగా కొడుతుంటే డైరెక్టర్ గట్టిగా కొట్టమన్నారు. షాహిద్ కూడా పర్లేదు గట్టిగా కొట్టు అని ఎంకరేజ్ చేసారు. కానీ నేను ఎంతసేపటికి కొట్టలేకపోయేసరికి షాహిద్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని గుర్తుచేసుకొని గట్టిగా కొట్టమన్నాడు. అయినా నేను కొట్టలేకపోయాను. ఆ సీన్ చేయడానికి దాదాపు 3 గంటలు పట్టింది అని తెలిపింది.