Nannante : హార్ట్ ట‌చింగ్ స‌బ్జెక్టుతో ఎమోషనల్ సినిమా ‘నాన్నంటే’ స్పెషల్ ప్రీమియర్..

తాజాగా నాన్నంటే సినిమా ప్రీమియ‌ర్ షోను హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో వేశారు.

Nannante : ఏఆర్ ఫిల్మ్ బ్యానర్ పై, నాగేశ్వర్ సమర్పణలో అశోక్ రెడ్డి లెంకల నిర్మాణంలో నంది వెంకట్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘నాన్నంటే’. వైఎస్‌కె, నిహరిక చౌదరి, వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

Also Read : Vishwak Sen : మొన్న ఎన్టీఆర్.. ఇప్పుడు బాలయ్య బాబు.. విశ్వక్ కోసం వస్తున్న నందమూరి హీరోలు..

తాజాగా నాన్నంటే సినిమా ప్రీమియ‌ర్ షోను హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో వేశారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, మీడియా ఈ ప్రీమియ‌ర్ షోను చూసి సినిమా యూనిట్‌ను అభినందించారు. అందరికి నాన్న అంటే ఉండే ఎమోష‌న్ ని ఈ సినిమాలో చూపించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ.. నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో చూపించాము. యువతకు కనెక్ట్ అయ్యే మెసేజ్ ఉంది. త్వ‌ర‌లోనే నాన్నంటే సినిమాను థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేయబోతున్నాం అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు