సంచలనం రేపిన మంత్రి రాసలీలల వీడియో కేసులో ఊహించని ట్విస్ట్

కర్నాటక రాష్ట్రంలో సంచలనం రేపిన మంత్రి రమేష్ జర్కిహోలి సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మంత్రిపై కేసుని వెనక్కి తీసుకున్నారు సామాజిక కార్యకర్త దినేష్ కలహళ్లి.

big twist in ramesh jarkiholi scandal case: కర్నాటక రాష్ట్రంలో సంచలనం రేపిన మంత్రి రమేష్ జర్కిహోళి సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సంచలన సీడీని బయటపెట్టిన సామాజిక కార్యకర్త దినేష్ కళ్లహళ్లి తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాది పోలీసులను కలిశారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాది.. తన క్లయింట్ దినేష్ కళ్లహళ్లి.. రమేష్ జర్కిహోళిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు.

యువతి ఇమేజ్ డ్యామేజ్ కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. బాధితురాలి క్షేమం, సమాజం క్షేమం కోసం తాను కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్టు వివరించారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలిని అవమానకరంగా చూస్తున్నారని చెప్పారు.

సీన్ రివర్స్:
‘ఈ కేసులో బాధితురాలికి లైంగిక వేధింపులు ఉన్నాయో, లేదో విచారణ జరపాలని మాత్రమే నా ఫిర్యాదులో కోరా. కానీ, విషయం బూమ్ రాంగ్ అయింది. నా మీద, బాధితురాలి మీద రివర్స్ అయింది. చాలా మంది మా ఉద్దేశాలను ప్రశ్నించారు. నిందలు మోపారు. ఆరోపణలు చేశారు. మమ్మల్ని కనిపిస్తే కాల్చేయాలన్న విధంగా ప్రవర్తించారు. బాధితురాలిని కాపాడాల్సిన వారు, ఆమెకు మద్దతుగా నిలవాల్సిన వారు ఇలా చేయడం బాధించింది’ అని దినేష్ అన్నట్టు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అందుకే తన ఫిర్యాదును విత్ డ్రా చేసుకుంటున్నట్టు చెప్పారు.

పని కోసం వచ్చిన మహిళతో రాసలీలలు:
కర్ణాటక భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి రమేష్ జర్కిహోళి ఓ మహిళతో రాసలీలలు సాగిస్తున్న వీడియో సీడీ బయటకు రావడంతో పెద్ద దుమారం రేగింది. తీవ్ర విమరలు రావడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఓ పని కోసం తన దగ్గరికి వచ్చిన మహిళను మంత్రి రమేష్ జర్కిహోళి లైంగికంగా వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. బెంగళూరులోని ఆర్‌టీ నగరలో నివాసం ఉండే యువతి రాష్ట్రంలోని డ్యామ్‌లను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది.

దీని కోసం ఆయన లైంగికంగా వాడుకున్నారని ఆరోపణ. దీనికి సంబంధించిన వీడియోను బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త, పౌర హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేష్ కల్లహళ్లి పోలీసులకు ఇచ్చాడు. బాధితురాలు తనకు న్యాయం చేయించాల్సిందిగా తనను కోరిందని ఆయన తెలిపాడు.

పోలీసులు మొదట ఈ కేసుని స్వీకరించ లేదు. అయితే, తాను మాత్రం వదిలిపెట్టబోనన్న దినేష్ ఏకంగా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడేమో కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేసుని విత్ డ్రా చేసుకోవడానికి దినేష్ ముందుకు రావడంతో దానిపై అధికారులతో పరిశీలించి, న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

మంత్రి రాసలీలల వీడియోని మొదటగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన దినేష్, సీడీని బెంగళూరు సీపీకి ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా మంత్రి అనుచరుల నుంచి ప్రాణభయం ఉందని పోలీసులతో చెప్పారు. ఇంతలోనే కేసుని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు దినేష్. దీంతో ఈ కేసు మరోసారి కర్నాటక రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు