Skin To Skin Contact : లైంగిక వేధింపులపై వివాదాస్పద తీర్పులిచ్చిన మహిళా జడ్జి పుష్ప రాజీనామా

స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ అవ్వకపోతే అవి లైంగిక వేధింపులు కావు అని వివాదాస్పద తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి పుష్ప గనేడివాలా రాజీనామా చేశారు.

Skin To Skin Contact case Bombay HC jedge Pushpa Ganediwala: స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ అవ్వకపోతే అవి లైంగిక వేధింపులు కావు అని ఓ చిన్నారిపై జరగిన లైంగిక వేధింపుల ఘటన కేసులో వివాదాస్పద తీర్పులిచ్చి పలు విమర్శలకు గురైన బాంబే హైకోర్టు మహిళా జడ్జి పుష్ప గనేడివాలా తన పదివికి రాజీనామా చేశారు. కానీ ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..తన పదవీకాలం ముగిసే ఒక్కరోజు ముందు ఆమె రాజీనామా చేయటం గమనించాల్సిన విషయం. అదనపు న్యాయమూర్తిగా ఆమె పదవీకాలం ఫిబ్రవరి 12తో పూర్తికానుంది.

Also read : స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, లైంగిక వేధింపులు కావు – బాంబే హైకోర్టు

53 ఏళ్ల జస్టిస్​ గనేడివాలా ప్రస్తుతం బాంబే హైకోర్టులోని నాగ్​పుర్​ బెంచ్​లో అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2021 జనవరిలో రెండు లైంగిక వేధింపుల కేసుల్లో పుష్ప వివాదాస్పద తీర్పులు ఇచ్చి పలు విమర్శలపాలయ్యారు. ఆఖరికి ఆమె ఇచ్చిన స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్స్ లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచనల వ్యాఖ్యలు చేసింది. బాంబే కోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయటం గమనార్హం. ఈ వివాదాస్పద తీర్పుల వల్ల ఆమె పదోన్నతి కూడా నిలిచిపోయింది.

ఆమెకు పూర్తిస్థాయిలో న్యాయమూర్తి హోదా కల్పించాలనే ప్రతిపాదనను సుప్రీం కోర్టు కొలీజియం వెనక్కి తీసుకుంది. ఆమె అదనపు న్యాయమూర్తిగా పదవీ కాలాన్ని పొడగించటం, పూర్తిస్థాయి హోదా కల్పించటం వంటి వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండిపోయింది. దీనికి ఫలితంగా జడ్జి పుష్ప డిమోట్​ అయ్యి.. 2022, ఫిబ్రవరి 12 నుంచి జిల్లా సెషన్స్​ జడ్జిగా వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఆమెకే కాదు ఒక రకంగా చెప్పాలంటే న్యాయవ్యవస్థకే మాయని మచ్చ అని న్యాయశాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఆమె డియోట్ అయ్యి జిల్లా సెషన్స్ జడ్జీగా వెళ్లాల్సి రావటం ఇష్టంలేకనే ఆమె రాజీనామా చేసినట్లు హైకోర్టు వర్గాలు వెల్లడించాయి. ఆమె చేసిన రాజీనామాకు ఆమోదం లభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Also read : Skin to Skin contact :స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్ కేసు..దుస్తుల పైనుంచి తాకినా లైంగిక వేధింపే : స్పష్టం చేసిన సుప్రీం

పుష్ప వివాదాస్పద తీర్పులు..
జస్టిస్‌ పుష్ప..2021 జనవరిలో రెండు సంచలన తీర్పులు వెలువరించారు. 12 ఏళ్ల బాలికపై పొరుగింటిలో ఉన్న ఓ వ్యక్తి అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బాలిక ఛాతీ భాగాన్ని తడిమాడు. అసభ్యంగా తాకాడు. దుస్తులు తొలగించబోయాడు. అతడు చేసిన, చేయబోయే దుర్మార్గం తెలుసుకునే వయసు లేకపోయినా….ఏదో జరుగుతోందని గ్రహించి ఆ చిన్నారి ప్రతిఘటించింది. పెద్దగా కేకలు వేసింది. ఆ అరుపులు విన్న తల్లి పరుగు పరుగున వచ్చి బాలికను కాపాడుకోగలిగింది. తన చిన్నారిపై జరిగిన ఈ ఘటనతో ఆవేదనతో న్యాయం చేయాలంటూ ధర్మాసనాన్ని ఆశ్రయించింది.

 

కానీ.. ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న పుష్ప గనేడివాలా..చర్మం తగలనందున దీనిని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని జనవరి 19న జస్టిస్‌ పుష్ప నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దుస్తుల మీద నుంచి శరీరభాగాలను తాకడం వేధింపులుగా పేర్కొనలేమని.. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొన్నారు.

Also read :  Bombay HC : మంచంమీద పడుకున్న మహిళ పాదాలు తాకినా ఆమె గౌరవాన్ని, మర్యాదను కించపరిచినట్లే : హైకోర్టు వ్యాఖ్యలు

అయిదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో కూడా జస్టిస్‌ పుష్ప ఇటువంటి తీర్పునే ఇచ్చారు. మైనర్‌ బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు పురుషుడు ప్యాంటు జిప్‌ విప్పి అసభ్యంగా సైగలు చేయటం..వంటివి లైంగిక వేధింపుల కిందికి రావని తీర్పు వెలువరించారు పుష్ప. వేధింపుల నుంచి బాలికలను రక్షించే పోక్సో చట్టం కింద వీటిని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేశారు. రాష్ట్ర సర్వోన్నత ధర్మాసనం న్యాయమూర్తిగా ఉన్న పుష్ప గనేడివాలా ఈ తీర్పులు తీవ్ర దుమారం రేపాయి.

 

ట్రెండింగ్ వార్తలు