Telangana Government : సీఎం రేవంత్ రెడ్డి దూకుడు.. కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు

బీఆర్ఎస్ ప్రభుత్వంలో 54 కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Government

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న గత ప్రభుత్వం నియమించిన సలహాదారులపై వేటు వేసిన సర్కార్.. తాజాగా అప్పటి ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు, పదవీ కాలం పొడిగింపు నిర్ణయాలను రద్దు చేసింది. 54 కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం మారిన వెంటనే కొందరు కార్పొరేషన్ల ఛైర్మన్లు రాజీనామా చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో 54 కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నిన్నటి రోజున ప్రభుత్వ సలహాదారులుగా ఏడుగురి నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇవాళ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ డెసిషన్ తీసుకుంది.

Also Read : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?

కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల రద్దు నిర్ణయం.. పరిపాలనలో భాగంగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారింది కాబట్టి కొత్తగా నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం మారిన వెంటనే పలువురు ఛైర్మన్లు తమ పదవులకు రిజైన్ చేసేశారు. మిగిలిన నియామకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలోనే ఈ కార్పొరేషన్లకు మళ్లీ నియామకాలు చేపట్టబోతున్నారు. కొత్త వారిని ఛైర్మన్లుగా నియమించనుంది రేవంత్ రెడ్డి సర్కార్.

Also Read : టీడీపీ-జనసేనకు వైసీపీ చెక్..! కాపులను తమవైపు తిప్పుకునేలా వ్యూహం..!

 

ట్రెండింగ్ వార్తలు