Inter 2nd Year Exams : ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దుపై జీవో జారీ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ జీవో జారీ చేసింది. ఫ‌లితాల వెల్ల‌డికి అనుస‌రించే విధానాన్ని రూపొందించాలని ఇంట‌ర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

Inter Second Year Exams : తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ జీవో జారీ చేసింది. ఫ‌లితాల వెల్ల‌డికి అనుస‌రించే విధానాన్ని రూపొందించాలని ఇంట‌ర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు. ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థుల‌ను ప్ర‌మోట్ చేస్తూ ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఇంటర్‌బోర్డు కార్యదర్శికి సూచించారు.

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను ఎప్పుడు నిర్ణయిస్తారన్న దానిపై విద్యాశాఖ క్లారిటీ ఇవ్వలేదు. ఫలితాలను ఏ ప్రాతిపదికన కేటాయించాలనేది ఇంటర్ బోర్డుకు అధికారాలు మంజూరు చేశారు. ఏప్రిల్‌ 15న ఇంటర్‌ పరీక్షల తేదీల వాయిదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్‌ చేయడంపై ఉత్తర్వులిచ్చింది.

ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సెకండియర్ లోకి ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేశారు. పరీక్షల రద్దుపై జీవో జారీ చేశారు. ఇంటర్ బోర్డు, ఇంటర్ ఫలితాల విధివిధానాలను ప్రభుత్వానికి పంపనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు