Emergency Alert : ఈ రోజు మీ ఫోన్‌కి ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా.. దాని అర్ధం ఏంటో తెలుసా?

ఇండియాలో ఈరోజు చాలా నగరాల్లో మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. బీప్ శబ్దంతో వచ్చిన మెసేజ్ చూసి చాలామంది గందరగోళానికి గురయ్యారు. ట్విట్టర్‌లో దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది.

Emergency Alert On Your Phone

Emergency Alert On Your Phone : ఒక్కోసారి ఫోన్లలో వచ్చే అత్యవసర హెచ్చరికలు వినియోగదారుల్ని గందరగోళానికి గురి చేస్తాయి. ఈరోజు భారతీయులు తమ మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ అందుకున్నారు. భారత ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ విభాగం నుంచి అనేక నగరాలకు ఈ అలెర్ట్ అంది కొంచెం గందరగోళానికి దారి తీసింది.

Japan: 2,761 ఎమర్జెన్సీ కాల్స్ చేసిన మహిళ.. అసలు ఎందుకు అన్ని కాల్స్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

ఈరోజు ఉదయం 10.20 ప్రాంతంలో ఆండ్రాయిడ్ ఫోన్లకు మెసేజ్ వచ్చింది. ఫోన్‌లో బీప్ శబ్దం చేస్తూ అలర్ట్ ప్రత్యక్షమైంది. ‘”ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. ఎందుకంటే మీ వైపు నుండి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం అమలులో ఉన్న TEST Pan-India ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌కి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ద్వారా పంపబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడంతో పాటు అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలు అందించడమే లక్ష్యంగా పెట్టుంది’ అని అలర్ట్ సూచించింది. గతంలో జూలై 20 న కూడా ఇలాంటి అలర్ట్ వచ్చింది.

Mobile Calling New Rule : మొబైల్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. మే 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్.. ఇకపై ఫేక్ ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు చెక్ పడినట్టే..!

ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఈ నోటిఫికేషన్ పంపినట్లు తెలుస్తోంది. చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అత్యవసర హెచ్చరికగా అందరూ భావిస్తున్నారు. ఇక ఈ నోటిఫికేషన్ తర్వాత ట్విట్టర్ మొత్తం ప్రశ్నలతో నిండిపోయింది. చాలామంది దీని వివరణ కోరారు. ఇండియాలో వైర్ లెస్ ఎమర్జెన్సీ అలర్ట్‌లను తీసుకువచ్చే విధానాలను కూడా సూచించమని నెటిజన్లు కోరారు. దిశ, పిల్లల కిడ్నాప్ వంటి కేసులను పరిష్కరించడానికి అమెరికా వంటి దేశాల్లో ఇది సమర్ధవంతంగా పనిచేస్తోంది అని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు