Chandrayaan-3: ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన తర్వాత తొలిసారి.. చంద్రుడి ఫొటోలు పంపిన ల్యాండర్ విక్రమ్

నిన్నవ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విజయవంతంగా విడిపోయిన విషయం తెలిసిందే.

Chandrayaan-3

Chandrayaan-3 ISRO: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota)లోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (Satish Dhawan Space Centre) నుంచి ప్రయోగించిన చంద్రయాన్‌-3 జాబిలికి చేరువవుతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి ప్రవేశపెట్టిన చంద్రయాన్-3 ఇప్పటికే విజయవంతంగా కీలక ఘట్టాలను సమర్థవంతంగా పూర్తి చేసుకుంది.

నిన్నవ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విజయవంతంగా విడిపోయిన విషయం తెలిసిందే. ప్రొపల్షన్ మాడ్యూల్ జీవిత కాలం 3 – 6 నెలల మధ్య ఉంటుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ద్వారా ఇస్రో అధ్యయనం చేయనుంది.

ఇందులో భాగంగా ల్యాండర్ తీసిన జాబిలి ఫొటోలను ఇస్రో వీడియో రూపంలో ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఈ నెల 15, 17 తేదీల్లో ఈ ఫొటోలను తీసినట్లు చెప్పింది. అలాగే, ల్యాండర్ మాడ్యూల్ డీబూస్టింగ్ ను ఇవాళ నిర్వహించారు. ఇది విజయవంతమైంది. మళ్లీ ఈ నెల 20న డీబూస్టింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నెల 23న సాయంత్రం జాబిలి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగుతుంది. ఈ సారి సేఫ్ ల్యాండింగ్ తప్పక జరుగుతుందని ఇస్రో భావిస్తోంది.

Chandrayaan 3 : చంద్రయాన్-3 కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ మాడ్యూల్..

ట్రెండింగ్ వార్తలు