Tambulam : తాంబూలం ఇస్తున్నారా? పద్ధతి పాటించకపోతే దోషం కలుగుతుందట

మహిళలు ఎక్కువగా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఎలా పడితే అలా తాంబూలం ఇవ్వడం వల్ల దోషం ఉంటుందట. తాంబూలం ఇచ్చే విధానంలోనే మనం ఎంతగా ఎదుటివారి శ్రేయస్సు కోరుకుంటున్నామో అర్ధం అవుతుందట. అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి?

Tambulam

Tambulam : పండుగలు, పర్వదినాలు, పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాల్లో మహిళలు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఎవరైనా పెద్ద ముత్తయిదువలు ఇంటికి వచ్చినా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు. తాంబూలం ఇవ్వడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఎలా పడితే అలా తాంబూలం ఇస్తే దాని ఫలితం ఉండదు సరికదా.. దోషం కూడా ఉంటుందని పెద్దలు చెబుతారు.

Shravana Masam 2023 : 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం .. ఈ పనులు అస్సలు చేయొద్దు

నోములు, పూజలు, వ్రతాల సమయంలో  ఎక్కువగా మహిళలు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. తాంబూలం ఇచ్చేందుకు కావాల్సిన అన్ని వస్తువులు తెచ్చుకుంటారు. కానీ ఇచ్చే పద్ధతిని కొందరు సరిగా పాటించరు. తాంబూలం ఇవ్వడంలోనే మీరు ఎదుటివారి శ్రేయస్సు ఎంతగా కోరుకుంటున్నారో అర్ధమైపోతుంది. అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి? అంటే

 

ముందుగా మూడు కానీ అంతకన్నా ఎక్కువగానీ తమలపాకులు తీసుకోవాలి. అవి శుభ్రంగా నీటితో కడిగినవి అయి ఉండాలి. ఆకు తొడిమలు మనవైపు ఉండేలాగా చూసుకోవాలి. ఆకులో వేసే ఒక్క కూడా ఒకటి తీసుకోకూడదు. రెండు ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎంత డబ్బు దక్షిణగా పెట్టాలి అనుకున్నా ఆ డబ్బుతో పాటు ఒక రూపాయి విడిగా తాంబూలంలో పెట్టాలి. ఇక అరటిపండ్లు, యాపిల్ తాంబూలంలో ఇవ్వొచ్చు. అయితే అవి కూడా రెండు తీసుకోవాలి. వాటి తొడిమలు కూడా మనవైపు ఉండేలా చూసుకోవాలి.

Sravana Masam : శ్రావణ మాసం విశిష్టమైనది ఎందుకంటే….

ఇక పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ కూడా వాటికి చేర్చుకోవచ్చు. ఇలా తాంబూలానికి ఇవ్వాల్సినవి అన్నీ సర్దుకున్నాక ముత్తయిదువ కాళ్లకు పసుపురాయాలి. పసుపు నేలకు అంటుకోకుండా క్లాత్, లేదా మ్యాట్ మీద వారి పాదాలు ఉంచి పసుపు రాయాలి. కొంతమంది పారాణి కూడా పెడతారు. మెడకు గంథం రాసి ముత్తయిదువకు కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు. తరువాత తాంబూలం తీసుకున్నవారు ఇచ్చిన వారికి కుంకుమ బొట్టు పెడతారు. వరలక్ష్మీ వ్రతం నాడు తాంబూలం ఉదయం వేళ ఇస్తారు. లేదంటే సాయంత్రం ఇవ్వొచ్చు. కానీ చీకటి పడకముందే తాంబూలం ఇవ్వడం మంచిది. ఇలాంటి కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఇచ్చినవారికి, పుచ్చుకున్నవారికి దోషం ఉండదు.

ట్రెండింగ్ వార్తలు