Rajampeta Floods : రాజంపేట వరద ఘటనలో 26 మంది మృతి..అధికారిక ప్రకటన

కడప జిల్లా రాజంపేట చేయ్యేరు వరద ఘటనలో 26 మంది మృతి చెందిన అధికారికంగా ప్రకటించారు. మృతి చెందిన 26 మందిలో నిన్నటివరకు 12 మృతదేహాలు, నేడు 9 మృతదేహాలు లభ్యం అయ్యాయి.

26 killed in Rajampeta floods : కడప జిల్లా రాజంపేట చెయ్యేరు వరద ఘటనలో 26 మంది మృతి చెందిన అధికారికంగా ప్రకటించారు. మృతి చెందిన 26 మందిలో నిన్నటివరకు 12 మృతదేహాలు, నేడు 9 మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఒకటి గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఇప్పటి వరకు 21 మృతదేహాలు కనుగొన్నామని వాటిలో 20 మృతదేహాలు వారి బంధువులకు అందించామని పోలీసులు తెలిపారు. ఒక మృతదేహాం పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఆస్పత్రిలో ఉంచామని తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, ఈశాన్య రుతుపవనాలు. వెరసి భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు తల్లడిల్లాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. పలు వాగులు వంకలు పొంగి పొర్లి పలు కాలనీలు నీటమునిగాయి.

Kaikala Satyanarayana : విషమంగానే కైకాల సత్యానారాయణ ఆరోగ్యం

అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో మునుపెన్నడూ చూడన విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు వరదల కారణంగా తిరుమల కొండచరియలు విరిగి ఘాట్‌ రోడ్డుపై పడిపోయాయి. అంతేకాకుండా మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. తిరుమల కొండలపైనుంచి వస్తున్న వాన నీటితో కపిలతీర్ధంలో మండపం కూలిపోయింది.

ట్రెండింగ్ వార్తలు