Nara Lokesh : రహస్యంగా ఢిల్లీకి నారా లోకేశ్.. ఎవరెవరిని కలుస్తారు? ఏం చెబుతారు? ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్

లోకేశ్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఏం చెబుతారు? అనేది ఉత్కంఠగా మారింది. Nara Lokesh - Delhi Tour

Nara Lokesh – Delhi Tour : ఏపీ రాజకీయాలు రోజురోజుకి ఊహించని విధంగా మలుపులు తిరుగుతున్నాయి. హాట్ హాట్ గా మారిపోతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ కావడం, ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడం, పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ సంచలనాలే. ఈ కేసులో చంద్రబాబుకి బెయిల్ ఎప్పుడు వస్తుంది? చంద్రబాబు ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాగా, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ నేత నారా లోకేశ్ ఢిల్లీ బాట పట్టారు. నారా లోకేశ్ ఢిల్లీ టూర్ ఇప్పుడు ఏపీ పొలిటికల్స్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. లోకేశ్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఏం చెబుతారు? అనేది ఉత్కంఠగా మారింది. పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో లోకేశ్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.

నారా లోకేశ్ ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి ఢిల్లీకి పయనం అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో లోకేశ్ హస్తిన టూర్ కు ప్రాధాన్యత ఏర్పడింది.

గురువారం(సెప్టెంబర్ 14) రాత్రి ఎంపీ రామ్మోహన్ నాయుడు మరో ముగ్గురితో కలిసి నారా లోకేశ్ ఢిల్లీకి పయనం అయ్యారు. గత నాలుగు రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు ఏ విధంగా అరెస్ట్ అయ్యారు? ప్రభుత్వం ఏ విధంగా అక్రమ కేసు పెట్టింది? అనేది ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు లోకేశ్ హస్తినకు పయనం అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నుంచి ఇప్పటివరకు జరిగిన దానిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారని సమాచారం.

Also Read..Roja Selvamani : మోదీ, అమిత్ షాలతో మాట్లాడి చంద్రబాబును విడిపించొచ్చు కదా- పవన్ కల్యాణ్‌కు మంత్రి రోజా సలహా

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని లోకేశ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? అనేది ఆయన వివరించనున్నారని సమాచారం. తనకు జరిగిన అన్యాయం, ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఢిల్లీ పెద్దలకు లోకేశ్ వివరిస్తారని తెలుస్తోంది. లోకేశ్ ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఢిల్లీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇవాళ్ల నారా లోకేశ్, బాలకృష్ణలతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి జైల్లో చంద్రబాబుని కలిశారు. ఆయనతో ములాఖత్ అయ్యారు. చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించేశారు. తమతో బీజేపీ కూడా కలిసి రావాలని కోరారు.

ఇక, చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం గురించి తాను ఢిల్లీ పెద్దలతో మాట్లాడి సమీక్షిస్తానని పవన్ చెప్పారు. ఇప్పటివరకు దీని గురించి ఢిల్లీ పెద్దలకు తెలియదన్న పవన్..వారి దృష్టికి తాను తీసుకెళ్తానన్నారు. విషయం తెలిశాక ఢిల్లీ పెద్దలు సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉందని పవన్ అన్నారు. పవన్ కల్యాణ్ అలా అన్న కొన్ని గంటల వ్యవధిలోనే నారా లోకేశ్ ఢిల్లీకి పయనం కావడం ఆసక్తి రేపుతోంది. ఏం జరగనుంది? అనే తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా చూస్తున్నారు.

చాలా రహస్యంగా నారా లోకేశ్ ఢిల్లీ టూర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చాలామంది జాతీయ స్థాయి నాయకులు లోకేశ్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ స్వయంగా వెళ్లి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో త్వరలో పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లేవనెత్తాలని నారా లోకేశ్ వారిని కోరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిణామాలను జాతీయ మీడియాకు స్వయంగా వివరించడానికి నారా లోకేశ్ ఢిల్లీ వెళ్తున్నారని మరికొన్ని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read..TDP Janasena Alliance: పూర్తిగా ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్.. తర్వాత ఏం జరగబోతోంది?

రేపు అంతా కూడా నారా లోకేశ్ జాతీయ మీడియాతో మాట్లాడతారని, ఏ విధంగా చంద్రబాబు అరెస్ట్ జరిగింది? ఏ విధంగా ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది? అన్న అంశాల గురించి జాతీయ మీడియాకు లోకేశ్ వివరిస్తారని సమాచారం. అదే సమయంలో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలిసేందుకు కూడా ఆయన సమయం కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ లోకేశ్ కోరారని, ఇప్పటివరకు ఖరారు కాలేదని, ఖరారైతే అమిత్ షాని, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా లోకేశ్ కలిసే ఛాన్స్ ఉంది.

Also Read..Roja Selvamani : మోదీ, అమిత్ షాలతో మాట్లాడి చంద్రబాబును విడిపించొచ్చు కదా- పవన్ కల్యాణ్‌కు మంత్రి రోజా సలహా

చంద్రబాబు అరెస్ట్ ని జేపీ నడ్డా ఖండించారని, గట్టిగా మాట్లాడమని బీజేపీ నేతలకు చెప్పారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ చెబుతున్నారు. అలాగే పలువురు న్యాయవాదులను కూడా లోకేశ్ కలవాలని భావిస్తున్నట్లు సమాచారం. మీడియాతో మాట్లాడటం, పార్లమెంటు సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్ అంశం చర్చకు వచ్చేలా వివిధ పక్షాల నేతలతో మాట్లాడటం, అలాగే అవకాశం ఉంటే బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలవడం.. ఈ ఎజెండాతోనే నారా లోకేశ్ ఢిల్లీకి పయనం అయినట్లు తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు