Ambati Rambabu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సాయం చేస్తే.. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామని లోకేష్ అన్నట్లు సమాచారం : అంబటి రాంబాబు

ఆసుపత్రికి తరలించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పురంధేశ్వరి చేరుతున్నారని విమర్శించారు.

Minister Ambati Rambabu

Ambati Rambabu – Lokesh : ప్రాథమిక ఆధారాలు ఉండటంతో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు చేశారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని పేర్కొన్నారు. వీఐపీ కావటంతో ఆహారం, మందులు బయట నుండి పంపిస్తున్నారని వెల్లడించారు. ఏ న్యాయస్థానంలోనూ చంద్రబాబుకు రిలీఫ్ రాలేదన్నారు. దీన్ని బట్టి ఆయన అవినీతి చేశాడని అర్థమవుతుందని తెలిపారు.

ఆరోగ్యం విషమంగా ఉందని గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. స్టెరాయిడ్స్ ఇస్తూ అంతం చేయడానికి కుట్ర చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఐదు కిలోల బరువు తగ్గారంటూ యనమల చెప్పారని పేర్కొన్నారు. అధికారికంగా చంద్రబాబు 67 కేజీలున్నట్లు తేల్చారని వెల్లడించారు.

Pawan Kalyan : న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి.. చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కల్యాణ్

చల్లటి వాతావరణం కావాలని జైలర్ ను అడిగితే ఏర్పాటు చేయరని, కోర్టు ఆదేశాల మేరకే ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు. నిన్నటి వరకూ కోర్టును ఏసీ కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
చంద్రబాబుకు చాలా కాలం నుండి చర్మసంబంధిత వ్యాధి ఉందన్నారు. రాజకీయ లబ్ధి పొందాలనే ఏసీ కావాలని అడగలేదన్నారు. నిజంగా ఆయన గురించి ఆలోచించే వారే అయితే ఎందుకు ఏసీ అడగలేదని నిలదీశారు. ఆసుపత్రికి తరలించాలన్నా కోర్టు తరలిస్తుందన్నారు.

ఆసుపత్రికి తరలించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పురంధేశ్వరి చేరుతున్నారని విమర్శించారు. చంద్రబాబును కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో బీజేపీ తన పని తాను చేసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. కేంద్ర పెద్దలను కలిసినా ఇప్పటి వరకూ ఎందుకు స్పందన లేదని అడిగారు.

BRS Manifesto: బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల.. కేసీఆర్‌ బీమా కింద కుటుంబానికి రూ.5 లక్షలు.. ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం

మద్యంపై సీబీఐ విచారణ చేయమని కేంద్ర హోంమంత్రిని పురంధేశ్వరి అడిగారని ఇంక తమకు సవాల్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. మీరు తఫిర్యాదు చేశారు.. విచారణ వేయించండి అని అన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తాం తమకు కేసులో సాయం చేయమని లోకేష్ అడిగినట్లు తనకు సమాచారం ఉందన్నారు. తన దగ్గర ఆధారాలు మాత్రం లేవన్నారు.

ఏ పార్టీని ఏ పార్టీలో విలీనం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టమని, తమకు సంబంధం లేని విషయం అన్నారు. సాగునీటికి కటకట ఉందని, వర్షాధార పంటలు మాత్రమే వేసుకోవాలని చెప్పామని తెలిపారు. పులి చింతల, పట్టి సీమ నుండి కొంత నీటిని డెల్టాకు ఇస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తు అవసరాలను గుర్తించి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. టెయిల్ ఎండ్స్ కు నీరు అందటం లేదన్న ఆందోళన డెల్టాలో ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు