Chiranjeevi : లండన్‌లోని హైడ్ పార్కులో మనవరాలు క్లీంకారతో చిరంజీవి.. ఫోటో వైరల్
మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 24, 2024 / 07:39 PM IST
Chiranjeevi family in london Pic goes viral
Chiranjeevi – Hyde Park : మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబంతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. తన భార్య సురేఖ, కొడుకు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఒలింపిక్స్ వేడుకలను వీక్షించేందుకు గురువారం పారిస్‌కు వెళ్లనున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
Also Read: మొన్న 5 నేడు 18 యూట్యూబ్ ఛానల్స్‌కు మా అసోసియేషన్ షాక్.. మరో హెచ్చరిక జారీ..
ఈ చిత్రంలో త్రిష, షికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే చరణ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తైంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ, అంజలి లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Also Read : రాజ్ తరుణ్ సినిమా.. మహేష్ శ్రీమంతుడిలా అనిపించొచ్చు కానీ..
