ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు ఎంత.. కేంద్రం ఏమీ చెప్పిందంటే?

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.

Ashwini Vaishnaw on allocations to Andhra Pradesh railway projects

Ashwini Vaishnaw: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులపై టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశ్నలకు లోక్‌సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. 2014- 2024 మధ్యకాలంలో ఏపీకి ఏడాదికి సగటున రూ. 8,406 కోట్ల రైల్వే నిధుల కేటాయింపు జరిగిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2009- 2014 మధ్యకాలంలో ఏపీకి సగటున ఏడాదికి రూ. 886 కోట్ల రైల్వే నిధుల కేటాయింపు జరిగిందన్నారు. 2014 తర్వాత నుంచి రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు దేశవ్యాప్తంగా గణనీయంగా పెరిగిందని తెలిపారు.

2009- 2014 మధ్యకాలంలో ఏపీలో ఏడాదికి 72.6 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. 2014- 2024 మధ్యకాలంలో ఏపీలో ఏడాదికి 151 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రాల సరిహద్దులకు లోబడి ఉండవు కాబట్టి వాటిని రాష్ట్రాలవారిగా కాకుండా రైల్వే జోన్ వారిగా కేటాయిస్తామని తెలిపారు.

ఏప్రిల్ 1 నాటికి ఏపీలో రూ. 26,292 కోట్ల విలువైన 1,935 కిలోమీటర్ల పొడవైన 17 కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందని.. ఇందులో కొన్ని ప్లానింగ్ దశలో ఉండగా, మరికొన్ని నిర్మాణం జరుగుతున్నాయన్నారు. 184 కిలోమీటర్ల పొడవైన రూ. 5,530 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు కొత్త రైల్వే ప్రాజెక్టుల ఆమోదం జరుగుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.

Also Read: ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుతో పాటు హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ట్రెండింగ్ వార్తలు