Rain Forecast : బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.

AP Rain Forecast

AP Rain Forecast : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రెండు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. కాగా, సోమవారం విజయనగరం, కోనసీమ, శ్రీకాకుళం, మన్యం, పశ్చిమగోదావరి, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Rain Forecast : దేశంలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

పలు రాష్ట్రాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతులం చేస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) భారీ వర్ష సూచన చేసింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

సెప్టెంబర్ 14వ తేదీ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలో రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవశాలున్నాయని పేర్కొంది. సెప్టెంబర్ 12 నుంచి ఒడిశా, ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు